AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: వామ్మో.. ‘చంద్రముఖి’ని మించిన మిస్టరీ..! ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్‌కి కాపలా ఉంటున్న ఫైథాన్..!!

ఓ ఫోటో ఫ్రేమ్ వెనకాల పాము కనిపించింది. అచ్చం సినిమాల లాగా ఓ ఫోటో ఫ్రేమ్ కి కాపలాగా ఉన్నట్టు ఓ కొండచిలువ దర్శనమిచ్చింది. దాన్ని చూసిన ఇంటి యజమాని షాక్ కి గురయ్యాడు.వెంటనే స్నేక్ క్యాచర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని అక్కడ నుంచి తీసేసాడు. కానీ, చంద్రముఖి సినిమాలో లాగా ఆ ఫోటోకి కూడా ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండి ఉంటుంది..? అంటున్నారు వీడియో చూసిన పలువురు నెటిజన్లు.

Watch Viral Video: వామ్మో.. 'చంద్రముఖి'ని మించిన మిస్టరీ..! ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్‌కి కాపలా ఉంటున్న ఫైథాన్..!!
Snake Hiding Behind A Photo
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Aug 28, 2023 | 1:22 PM

Share

అందరికీ చంద్రముఖి సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నటువంటి చంద్రముఖి క్యారెక్టర్ గురించి ప్రస్తావన రాగానే ఒక పెద్ద పాము ఆ మహల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. చంద్రముఖి ఫోటో ఉన్న రూమ్ లో ఆ పాము కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ఫోటో ఫ్రేమ్ కి ఆ పెద్ద పాముకి ఏదో సంబంధం ఉండి ఉంటుంది అని అందరి అనుమానం. అయితే అచ్చం అలాంటి సంఘటన నిజంగా జరిగితే ? ఆ ప్లేస్ లో మీరే ఉండి ఉంటే ఏంటి పరిస్థితి? ఇదంతా ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నామో ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.

మన ఇంట్లో ఎంతో ఇష్టంగా పూల మొక్కలు, అందమైన పెయింటింగ్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇంట్లో ఎంతో అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ ల వెనకాల , పెయింటింగ్స్ వెనకాల క్లీన్ చేస్తూ ఉంటాం ఎందుకంటే క్రిమి కీటకాలు ఏవైనా వస్తే ఇంట్లో ఇబ్బంది కాబట్టి. కానీ ఓ ఇంట్లో ఓ ఫోటో ఫ్రేమ్ వెనకాల పాము కనిపించింది. అచ్చం సినిమాల లాగా ఓ ఫోటో ఫ్రేమ్ కి కాపలాగా ఉన్నట్టు ఓ కొండచిలువ దర్శనమిచ్చింది. దాన్ని చూసిన ఇంటి యజమాని షాక్ కి గురయ్యాడు.వెంటనే స్నేక్ క్యాచర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని అక్కడ నుంచి తీసేసాడు.

ఇవి కూడా చదవండి

ఇదంతా ఎక్కడ జరిగిందని మీ అనుమానం కదా. గుండెలు జారిపోయేలాంటి ఈ ఘటన జరిగింది ఆస్ట్రేలియాలోని ఓ ఇంట్లో. ఇంటి యజమాని ఇంటి గోడకి తనకి ఇష్టమైన ఒక ఫోటో ఫ్రేమ్ ని వెలడ తీశాడు.అయితే ఆ ఫోటో ఫ్రేమ్ వెనకాల ఒక కొండచిలువ కనిపించడంతో షాక్ కి గురై వెంటనే స్నేక్ క్యాచర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దీంతో వాళ్ళు వచ్చి కొండచిలువను పట్టుకొని తీసుకెళ్లారు. దీంతో రిలాక్స్ అయ్యాడు ఆ ఇంటి యజమాని. స్నేక్ క్యాచర్ ఈ వీడియో నీ తన instagram అకౌంట్ లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన వారంతా భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఆ కొండచిలువకు ఆ ఫోటో ఫ్రేమ్ నచ్చిందేమో అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. చంద్రముఖి సినిమాలో లాగా ఆ ఫోటోకి కూడా ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండి ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు