AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: గాయపడిన చిరుత ప్రాణం కాపాడిన ఫోటోగ్రాఫర్‌.. ఆ తర్వాత అది ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవుతారు..

27 సెకన్ల వీడియోలో అడవిలో గాయపడిన చిరుత ఒకటి లేవలేక అవస్థలు పడుతుంది. నోప్పి భాధతో తల్లడిల్లుతోంది. అది చూసిన ఓ వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ దానికి సపర్యాలు చేశాడు. బాటిల్‌తో చిరుతకు నీళ్లు తాగించాడు. మరోకరి సాయంతో చిరుతను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ కోలుకున్న తర్వాత జంతువును తిరిగి అడవిలో విడిచిపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. ఆ క్షణం ఎంతో

Watch Viral Video: గాయపడిన చిరుత ప్రాణం కాపాడిన ఫోటోగ్రాఫర్‌.. ఆ తర్వాత అది  ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవుతారు..
Injured Cheetah
Jyothi Gadda
|

Updated on: Aug 28, 2023 | 11:13 AM

Share

గాయపడిన చిరుత ప్రాణాన్ని కాపాడాడు ఓ ఫోటోగ్రాఫర్. ఆ తర్వాత మళ్లీ అతడు అడవిలోకి ఫోటోలు తీయడానికి వెళ్లినప్పుడు ఆ జంతువు అతని దగ్గరికి వచ్చి కౌగిలించుకున్న తీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రూర మృగాల్లో కూడా మానవత్వం, కృతజ్ఞాతా భావం ఉంటుందని ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. సింహం, చిరుతపులి, చిరుత వంటి అడవి జంతువులు భయంకరమైన క్రూరమృగాలుగా పేరుగాంచాయి. ఇతర జంతువులు సైతం వీటికి భయపడుతుంటాయి. మనుషులు కూడా అలాంటి క్రూర జంతువులకు దూరంగా ఉండటం మంచిదని భావిస్తారు. కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియో చూస్తే మాత్రం నమ్మడం కష్టమే. ఎందుకంటే.. భయంకరమైన జంతువు, మనిషికి మధ్య స్నేహం కనిపించింది ఈ వీడియోలో. ఇలాంటి వీడియోలను మీరు కూడా చాలానే చూసి ఉంటారు. కానీ, ఇది పూర్తిభిన్నమైనది.

27 సెకన్ల వీడియోలో అడవిలో గాయపడిన చిరుత ఒకటి లేవలేక అవస్థలు పడుతుంది. నోప్పి భాధతో తల్లడిల్లుతోంది. అది చూసిన ఓ వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ దానికి సపర్యాలు చేశాడు. బాటిల్‌తో చిరుతకు నీళ్లు తాగించాడు. మరోకరి సాయంతో చిరుతను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ కోలుకున్న తర్వాత జంతువును తిరిగి అడవిలో విడిచిపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. ఆ క్షణం ఎంతో అందంగా ఉంది. ఫోటోగ్రాఫర్‌పై అభిమానం పెంచుకున్న చిరుత ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజంగా ఇదంతా నిజమేనా..? అనే సందేహంతో మీరు నోరెళ్ల బెట్టాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఫోటోల కోసం మరోసారి ఆ ఫోటో గ్రాఫర్ అడవిలోకి వెళ్లాడు. చిరుతను ఫోటోలు తీస్తుండగా,.. ఆ జంతువు అతన్ని చూడగానే గుర్తుపట్టింది. వెంటనే అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అతనిపై ఎంతో ప్రేమను కురిపిస్తూ.. అతని ఒడిలో వాలిపోతుంది. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత మీరు కూడా ఎంతగానో సంతోషిస్తారు. క్రూర జంతువైన సరైన ఆపదలో సాయం చేస్తే…అవి మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోవు. అవి మీకు ఆవు దూడగా మారిపోయి మీతో స్నేహం చేస్తాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఆగస్ట్ 22న షేర్ చేసిన ఈ క్లిప్‌కి 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది (@1hakankapucu) అనే ఖాతా ద్వారా Twitter (ఇప్పుడు x)లో పోస్ట్ చేశారు. అలాగే 90 వేల మంది లైకులు కూడా వచ్చాయి. ఇది క్యాప్షన్‌లో ఈ ఫోటోగ్రాఫర్ గాయపడిన చిరుతకు చికిత్స చేయించాడు. అతను ఫోటో తీయడానికి మళ్ళీ దాని దగ్గరికి వస్తే, జంతువు అతనికి దగ్గరగా వచ్చి కౌగిలించుకుంటుంది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు… వారి స్పందన తెలియజేస్తున్నారు. జంతువులకు ప్రేమ పంచండి.. మీరు వాటి ప్రేమ పొందుతారు. మరొకరు వ్యాఖ్యానించారు- వావ్! ఏం అనుభవం అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?