Drunken Inspector: ఇదేంటి సీఐగారు.. మీరే తాగి రోడ్డెక్కితే ఇలా కాక ఇంకెలా అవుతుంది.?
నియామ నిబంధనలు పాటించాల్సిన పోలీసులే తప్పటడుగులేస్తున్నారు. ఫుల్‌గా మందు కొట్టిన ఓ ఖాకీ బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటోను ఒక వాహనం ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
నియామ నిబంధనలు పాటించాల్సిన పోలీసులే తప్పటడుగులేస్తున్నారు. ఫుల్‌గా మందు కొట్టిన ఓ ఖాకీ బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటోను ఒక వాహనం ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కట్ చేస్తే వాహనం నడిపింది పోలీసు ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఐటి విభాగంలో ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఈప్రమాదంలో ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం గాయపడిన వారిని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి గురైన సమయంలో ఇన్స్‌పెక్టర్ మోతాదుకు నుంచి మద్యం సేవించినట్లు గుర్తించారు. పోలీసుల బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో ఇన్స్‌పెక్టర్ కు 210 పాయింట్లు వచ్చింది. డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాల్సిన పోలీసులే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఈ ఇన్స్‌పెక్టర్ వాహనంపై ఏకంగా 6 పెండింగ్ చాలాన్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ TS 09 EY 3330గా గుర్తించారు. ఈ వాహనం ఓవర్ స్పీడ్ తోపాటు నో పార్కింగ్ చలాన్లు కూడా ఉన్నాయి…
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..