Uttar pradesh: ఇక్కడ సగం ధరకే బంగారు నాణెలు.. అక్కడే ఉంది అసలు తిరకాసు.. 109 కొంటే..

మా దగ్గర ఇలాంటివి ఇంకా 109 నాణేలు ఉన్నాయి. మార్కెట్‌లో వీటి ధర చాలా ఎక్కువ. కానీ, మేం వీటిని మార్కెట్లో విక్రయించలేమని బంగారు నాణెలు కలిగిన వ్యక్తి చెప్పాడు. అందుకే తక్కువ ధరకే వాటిని అమ్మేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. మొత్తం 109 నాణాలకు గానూ రూ.12 లక్షలు మాత్రమే చెల్లిస్తే చాలు అని చెప్పాడు. దీనికి స్వర్ణకారులు అంగీకరించారు.

Uttar pradesh: ఇక్కడ సగం ధరకే బంగారు నాణెలు.. అక్కడే ఉంది అసలు తిరకాసు.. 109 కొంటే..
Gold Coin
Follow us

|

Updated on: Aug 28, 2023 | 8:42 AM

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన మోసం వెలుగులోకి వచ్చింది. బంగారు నాణెం కోసం ఓ నగల వ్యాపారి రూ.12 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. గోరఖ్‌పూర్‌లోని షాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో నివాసం ఉంటున్న నగల వ్యాపారి సంతోష్‌ కుమార్‌ వర్మకు ఖాజానీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అన్‌వాల్‌కు చెందిన ఓ యువకుడి వద్ద 109 బంగారు నాణేలు ఉన్నట్లు సమాచారం అందింది. వాటిని అతడు తక్కువ ధరకు విక్రయిస్తున్నాడని తెలిసింది. దాంతో ఆ నగల వ్యాపారి అతని వద్దకు వెళ్లి బంగారు నాణెం తీసుకున్నాడు.. నాణెం చెక్ చేసుకోగా అసలైనదే అని తేలింది. పైగా మా దగ్గర అలాంటివి ఇంకా 109 నాణేలు ఉన్నాయని చెప్పాడు. మార్కెట్‌లో వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది.. ఎందుకంటే వాటిని మార్కెట్లో విక్రయించలేమని చెప్పాడు. అందుకే తక్కువ ధరకే వాటిని అమ్మేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. మొత్తం 109 నాణాలకు గానూ రూ.12 లక్షలు మాత్రమే చెల్లిస్తే చాలు అని చెప్పాడు. దీనికి స్వర్ణకారులు అంగీకరించారు.

అసలు విషయం ఏమిటి?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగల వ్యాపారులు నాణేన్ని పరిశీలించగా, మొదటి నాణెం మేలిమి బంగారంగా తేలింది. దీని తర్వాత అతను మరో 108 నాణేలను తీసుకున్నాడు. ఈ నాణేలతో ఇంటికి చేరుకున్న వ్యాపారి వాటిని పరిశీలించగా అవి నకిలీవని తేలింది. మోసపోయానని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, నిఘా సాయంతో నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తిని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పట్టుకుని విచారించగా.. దీని వెనుక ముగ్గురు సభ్యుల ముఠా ఉన్నట్టుగా గుర్తించారు. పైగా ఈ ముగ్గురు ప్రధాన నిందితులు చోరీకి మరో ప్లాన్‌ వేసినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

కేటు బంగారంతో వ్యాపారుల్ని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు…ఈ సారి నకిలీ నోట్ల కట్టకు పైనా, కిందా కొన్ని నిజమైన నోట్లను పెట్టి తక్కువ ధరకు జనాలకు అంటగట్టాలని కొత్త ఎత్తుగడకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ కుట్ర ఫలించకపోగా, పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఎస్‌సి గౌరవ్ గ్రోవర్ తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టుగా చెప్పారు. త్వరలోనే ఆ ఇద్దరినీ కూడా అరెస్టు చేస్తామన్నారు. నిందితుల నుంచి 10 లక్షల 85 వేల రూపాయలు, రెండు బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు నకిలీ నోట్ల కట్టలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…

ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!