- Telugu News Photo Gallery Technology photos AI will not replace you at your job says un latest study Telugu News
AI వల్ల మీ ఉద్యోగానికి ప్రమాదం ఉందా? ఐక్యరాజ్యసమితి షాకింగ్ అధ్యయనం వెల్లడి..
AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి చాలా మంది మనస్సులలో ఒక ప్రశ్న మెదులుతోంది. అది మన ఉద్యోగాలను మింగేస్తుందని. అయితే దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు దీన్ని అనేక రంగాల్లో వాడుకుని.. ఆ తర్వాత చాలా మంది ఉద్యోగాలను మింగేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేగానీ, AI మనిషికి..
Updated on: Aug 28, 2023 | 10:26 AM

యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ఇటీవల ఒక అధ్యయనాన్ని పూర్తి చేసింది. ఇందులో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మన ఉద్యోగాలను బలితీసుకోవదని చెప్పింది. కొత్త అధ్యయనంలో మరెన్నో ఆసక్తికర విషయాలను బయటపడింది.

ILO అధ్యయనంలో AI మనం పని చేసే విధానాన్ని మారుస్తుందని తెలిసింది. ఇది మనుషులు చేసే పనిని తీసుకోదని, మనిషికి పని లేకుండా చేయదని చెప్పింది. అంతేగానీ, పని తీరును మారుస్తుందన్నారు.

అధ్యయనం ప్రకారం, ఆటోమేషన్ కారణంగా కొన్ని ఉద్యోగాలు, పరిశ్రమలు పాక్షికంగా ప్రభావితం కావచ్చు. చాలా కంపెనీలు కొత్త తరం AIని అవలంబిస్తున్నాయి, తద్వారా అవి ఆవిష్కరణలో భాగం అవుతాయి. కొన్ని విషయాలు ఆటోమేషన్ అవుతుందన్నారు.

ChatGPT కాకుండా, Google, Microsoft వంటి టెక్ కంపెనీలు తమ స్వంత కృత్రిమ మేధస్సు వ్యవస్థలను రూపొందిస్తున్నాయి. గూగుల్ తన బార్డ్ ఏఐని సిద్ధం చేస్తోంది. గూగుల్‌తో సహా అనేక కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి.

చాట్‌జిపిటిని తీసుకురావడం ఉద్దేశ్యం మానవులకు సహాయం చేయడం. అయితే ఇప్పుడు దీన్ని అనేక రంగాల్లో వాడుకుని.. ఆ తర్వాత చాలా మంది ఉద్యోగాలను మింగేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేగానీ, AI మనిషికి సహాయం చేస్తుంది.

ఇకపోతే, ఇప్పటికే పదిహేను శాతం సంస్థలు ప్రస్తుతం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నాయి. అయితే, ఆ గణాంకాలు వచ్చే ఏడాదిలో గణనీయంగా మారుతాయంటున్నారు నిపుణులు. రాబోయే ఏడాది కాలంలో 31 శాతం సంస్థలు AIలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు పని చేసే విధానాన్ని మారుస్తుంది. తద్వారా ఉద్యోగులు పని చేసే విధానం కూడా మారుతుంది.





























