AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రా.. ఎన్టీఆర్’ పేరుతో కొత్త కార్యక్రమం.. ఎందుకో తెలుసా..

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోను ప్రకటిస్తుంటాయి. ఎన్నికల్లో తమను గెలిపిస్తే చేసే కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ది పనులు, తాయిలాలకు సంబంధించిన వివరాలను పొందుపొర్చి జనరంజకంగా తయారు చేస్తుంటాయి. అయితే సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్చంద సంస్థలు కూడా ఎన్నికల సమయలో తమ మేనిఫెస్టోను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

'రా.. ఎన్టీఆర్' పేరుతో కొత్త కార్యక్రమం.. ఎందుకో తెలుసా..
Jr. Ntr Servie Trust
Fairoz Baig
| Edited By: Srikar T|

Updated on: Mar 03, 2024 | 8:31 PM

Share

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోను ప్రకటిస్తుంటాయి. ఎన్నికల్లో తమను గెలిపిస్తే చేసే కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ది పనులు, తాయిలాలకు సంబంధించిన వివరాలను పొందుపొర్చి జనరంజకంగా తయారు చేస్తుంటాయి. అయితే సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్చంద సంస్థలు కూడా ఎన్నికల సమయలో తమ మేనిఫెస్టోను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అదికూడా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ అభిమానులు నిర్వహిస్తున్న రా.. ఎన్‌టిఆర్‌ సంస్థ తమ మేనిఫెస్టోను ప్రకటించడం ఆశక్తికరంగా మారింది. తాము రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటూనే ఎన్నికల వేళ తమ మేనిఫెస్టోను ప్రకటించడం వెనుక ఉద్దేశాలపై అనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎన్నికల సమయంలో తమ కధానాయకుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, అలాగే ఆయన ఏ రాజకీయపార్టీకి మద్దతు ప్రకటించలేదని చెప్పడం వెనుక ఎన్టీఆర్‌ అభిమానులకు ఓ సందేశం పంపించేందుకే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సందేశం ప్రస్తుతానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు.. అన్నది స్పష్టం చేయడానికే అన్నట్టుగా ఉంది.

ఒంగోలులో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ‘రా.. ఎన్టీఆర్‌’ పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో అనగానే రాజకీయ పార్టీల తరహాలో వాగ్దానాలు అమలు చేసే విధానం ఉండదని, ఇది కేవలం రానున్న రోజుల్లో తాము రాజకీయాలకు అతీతంగా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించే విధానమని ‘రా.. ఎన్టీఆర్‌’ నిర్వాహకులు తెలిపారు. రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టో ఎన్నికల తరువాత అమలు చేస్తారా లేదా అన్న సందేహాలు ఉంటాయని, అయితే నందమూరి తారకరామారావు ఒకసారి మాట ఇస్తే తప్పకుండా అమలు చేసే వ్యక్తి కాబట్టి తాము కూడా మాటతప్పకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామంటున్నారు. అందులో భాగంగా ఐదు సూత్రాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. చిన్నారులకు ప్రాధమిక విద్య, యువతకు తోడు, యుద్దానికి ఆయుధం, చేసే వ్యవసాయానికి తీసే కలుపు, మిషన్‌ 2029.. ఇలా ఐదు అంశాలను ప్రతిపాదించారు. ఈ కార్యక్రమాలను రాబోయే ఐదేళ్ళలో చేసేందుకు నిర్ణయించుకుని మిషన్‌ 2029 పేరుతో టార్గెట్‌ పెట్టుకున్నామని తెలిపారు. తమ ఆర్గనైజేషన్‌ “రా.. ఎన్‌టిఆర్‌’ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తోందని, జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని, అలాగే ఆయన ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదన్న విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కేవలం సేవా కార్యక్రమాలు చేయడానికి ఉద్దేశించి మాత్రమే తమ ఆర్గనైజేషన్‌ పనిచేస్తుందని ఆ సంస్థ నిర్వాహకులు నల్లూరి సాయిరూప్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..