AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram train collision: లోకో పైలెట్‌ మొబైల్‌లో క్రికెట్‌ చూస్తూ రైలు నడపడంతోనే ప్రమాదం.. రైల్వే మంత్రి చెప్పిన షాకింగ్‌ వాస్తవాలు..!

అక్టోబరు 29న రాత్రి 7 గంటల ప్రాంతంలో హౌరా-చెన్నై లైన్‌లో కంటకపల్లిలో రాయగడ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం పలాస రైలును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.. దేశంలో రైలు రవాణాకు కొత్త భద్రతా ప్రమాణాలను ప్రవేశపెడుతున్న సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

Vizianagaram train collision: లోకో పైలెట్‌ మొబైల్‌లో క్రికెట్‌ చూస్తూ రైలు నడపడంతోనే ప్రమాదం.. రైల్వే మంత్రి చెప్పిన షాకింగ్‌ వాస్తవాలు..!
Andhra Train Collision
Jyothi Gadda
|

Updated on: Mar 03, 2024 | 9:00 PM

Share

దాదాపు ఐదు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాదానికి గల కారణాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణ వెల్లడించారు. 29 అక్టోబర్ 2023న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకపల్లి ప్రాంతంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ ప్రమాదంలో 14 మంది చనిపోయారు. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. శనివారం రైలు ప్రమాదానికి గల కారణాల గురించి రైల్వే మంత్రి మాట్లాడుతూ, రైలు డ్రైవర్ మరియు కో-డ్రైవర్ తమ మొబైల్ ఫోన్‌లలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని చెప్పారు. అదే ఈ ప్రమాదానికి కారణం అని స్పష్టం చేశారు.

దేశంలో కొనసాగుతున్న రైలు ప్రమాదాల నేపథ్యంలో 2023లో జరిగిన రైలు ప్రమాదానికి కారణాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. లోకో పైలట్లు తమ మొబైల్ ఫోన్లలో క్రికెట్ మ్యాచ్ చూడడం వల్లే రైలు ప్రమాదం జరిగిందని మంత్రి వెల్లడించారు. 2023 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో ఒకదానికి లోకోపైలట్‌, అసిస్టెంట్ లోకో పైలట్‌ స్మార్ట్‌ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు. అక్టోబరు 29న రాత్రి 7 గంటల ప్రాంతంలో హౌరా-చెన్నై లైన్‌లో కంటకపల్లిలో రాయగడ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం పలాస రైలును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.. దేశంలో రైలు రవాణాకు కొత్త భద్రతా ప్రమాణాలను ప్రవేశపెడుతున్న సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

భద్రతపై దృష్టి సారించి చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి గల మూలకారణం ఏమిటో తెలుసుకుని పూర్తిగా పరిష్కరించి, పునరావృతం కాకుండా చూసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. కొత్త టెక్నాలజీ వల్ల డ్రైవర్, కో-డ్రైవర్ ఫోకస్ కోల్పోయే అవకాశం ఉండదని రైల్వే మంత్రి తెలిపారు. వారి దృష్టి మరే ఇతర వాటి పైకి వెళ్లినా వెంటనే..సాంకేతికత వారిని అప్రమత్తం చేస్తుందని చెప్పారు. కొత్త టెక్నాలజీ వల్ల లోకో పైలెట్‌ రైలు కదలికలపై పూర్తి అప్రమత్తంగా ఉండగలడని వివరించారు. రైళ్లలో భద్రత, భద్రతా చర్యలపై తాము మరింత దృష్టి సారిస్తున్నామని రైల్వే మంత్రి తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించి నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంపై సీఆర్‌ఎస్ (కమీషనర్లు ఆఫ్ రైల్వే సేఫ్టీ) విచారణ జరిపింది. అదే సమయంలో లోకో పైలట్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని దర్యాప్తు నివేదిక చెబుతోంది. విచారణ నివేదికను వారు ఇంకా బహిరంగపరచలేదు. అయితే ప్రాథమిక విచారణ అనంతరం రాయ్‌గఢ్‌ ప్యాసింజర్‌ రైలు డ్రైవర్‌, కో-డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..