Rat Remove Tips: ఎలుకల బెడద ఎక్కువగా ఉందా? అయితే, ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ..!

ఎలుకల బెడద వదిలించుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లలు తెలియక ఎలుకల కోసం పెట్టిన బిస్కెట్లు వంటివి తినటం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే, కొందరు కొన్న రకాల మెడిసిన్స్‌ వాడటం వల్ల పెద్దవాళ్లు కూడా అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే మీ ప్రాణాలకు హాని కలగకుండా ఎలుకలను ఇంటి నుంచి వెళ్లగొట్టే చిట్కాలు కొన్ని ఉన్నాయి.

Rat Remove Tips: ఎలుకల బెడద ఎక్కువగా ఉందా? అయితే, ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ..!
Rats
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 03, 2024 | 7:32 PM

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎలుకల బెడద కామన్‌గానే ఉంటుంది. ఇంట్లో ఎలుకలు చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇంట్లోని వస్తువులు, బట్టలు,బొమ్మలు, తినే పదార్థాలు ఏదీ వదలకుండా ఎలుకలు పాడుచేస్తుంటాయి. ఎలుకల బెడద వదిలించుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లలు తెలియక ఎలుకల కోసం పెట్టిన బిస్కెట్లు వంటివి తినటం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే, కొందరు కొన్న రకాల మెడిసిన్స్‌ వాడటం వల్ల పెద్దవాళ్లు కూడా అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే మీ ప్రాణాలకు హాని కలగకుండా ఎలుకలను ఇంటి నుంచి వెళ్లగొట్టే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆముదం:

ఎలుకలను ఇంట్లో నుండి దూరంగా ఉంచడంలో ఆముదం చాలా సహాయపడుతుంది. ముందుగా ఆముదం గింజలను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. తర్వాత ఈ పొడిని ఏదైనా పిండితో కలిపి బంతిలా చేసుకోవాలి. ఎలుకలు తరచుగా ఉండే ప్రదేశాలలో ఆ చిన్న గుళికలను ఉంచండి. వీటిని తింటే ఎలుకలు ఇంట్లో నుంచి పారిపోతాయి.

ఇవి కూడా చదవండి

నాఫ్తలీన్స్ గుళికలు:

కర్పూరంలా కనిపించే ఈ నాఫ్తలిన్ మాత్రలు ఎలుకలకు నచ్చవు. నాఫ్తలిన్ బాల్స్ వాసన చూస్తే ఎలుకలు పారిపోతారు. నాఫ్తలీన్ బాల్స్ ను క్రష్ చేసి, పిండిలో కలపాలి. ఇప్పుడు నీళ్లు పోసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీని తర్వాత ఇంట్లోని మూలల్లో ఈ పిండిముద్దలు పెడితే ఎలుకలు పారిపోతాయ్‌. నాఫ్తలిన్‌ వాసన చూసి ఎలుకలు ఇంటి నుంచి వెళ్లిపోతాయి.

బేకింగ్ సోడా- పిప్పరమింట్:

ఎలుకలను వదిలించుకోవడానికి మరొక మార్గం ఉంది. బేకింగ్ సోడా, పిప్పరమింట్. ముందుగా ఒక కప్పు మైదా తీసుకోండి. దానికి పిప్పరమింట్ ఆయిల్, బేకింగ్ సోడా వేసి కలపాలి. ఈ పిండితో చిన్న చిన్న ముద్దలు తయారు చేసి ఇంట్లో ఎలుకలు వచ్చే ప్రదేశాల్లో ఉంచండి. ఇలా చేస్తే ఎలుకలు పారిపోతాయి.

అలాగే, మరికొన్ని చిట్కాలు కూడా ఎలుకల్ని తరిమికొట్టేందుకు ఉపయోగపడతాయి. ఉల్లిపాయలను రెండుగా చీల్చి పెడితే ఘాటు వాసనకు ఎలుకలు ఆ దరిదాపుల్లోకి కూడా రావట. పుదినా నూనెను ఇంటి మూలల్లో చల్లితే ఆ ఘాటు వాసనకు ఎలుకలు రాకుండా పారిపోతాయి.. అలాగే లవంగాలు, మిరియాలను పొడిగా చేసి ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో చల్లితే ఈజీగా బయటకు పారిపోతాయి. ఒక క్లాత్‌లో కొద్దిగా కారం మూట కట్టి ఎలుకలు ఉన్న దగ్గర పెడితే మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..