Horse Gram Benefits: గుర్రాలకు పెట్టే గుగ్గిలు, మనం తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ఈ సమస్యలన్నీ పరార్.. నిండు ఆరోగ్యం..!

రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపర్చి హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. జ్వరంతో పాటు ఆయాసం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు ఉలవల కషాయం తాగడం మంచిది. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది. తక్కువ స్పెర్మ్ కౌంట్ కారణంగా సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్న పురుషులకు..

Horse Gram Benefits: గుర్రాలకు పెట్టే గుగ్గిలు, మనం తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ఈ సమస్యలన్నీ పరార్.. నిండు ఆరోగ్యం..!
Horse Gram
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 03, 2024 | 6:32 PM

మీరు అనేక రకాల పప్పుల పేర్లను వినే ఉంటారు. కొన్ని పప్పుల గురించిన సమాచారం చాలా మందికి తెలియదు. కానీ, అలాంటి పప్పుల వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో ఉలవలు కూడా ఒకటి. ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు శక్తిని అందిస్తాయి. అందువల్ల వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.  ఉలవల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలిక దగ్గు, ఉబ్బసం, మూత్రపిండాల్లో రాళ్లు, క్రమరహిత పీరియడ్స్‌లో కూడా ఉలవలు ఉపయోగకరంగా ఉంటుంది.

ఉలవలు తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పప్పులో ఉండే పోషకాలు ఆకలిని అదుపులో ఉంచుతాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇందులో కేలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఉలవలు పప్పు తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఉలవల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికల్ని మెరుగుపరుస్తుంది. తద్వారా మలం సాఫీగా వచ్చేలా చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

పెరిగే పిల్లలకు ఉలవలు తినిపిస్తే చాలా మంచిది. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో సహాయపడతాయి. వారిని బలంగా ఉంచుతాయి. ఉలవలు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. మూత్రవిసర్జనగా పనిచేస్తుంది. ఇది హానికరమైన పదార్థాలు, మూత్రపిండాల్లో రాళ్లను మూత్రం ద్వారా తొలగించడంలో సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్లను నివారించడంలో ఉలవలు ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. వీటిలోని పోషకాలు కిడ్నీ రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి.

ఇవి కూడా చదవండి

కొందరు తరచూ ఎక్కిళ్లు సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఉలవలు తీసుకోవడం చాలా మంచిది. ఉలవలు తినడం ద్వారా ఎక్కిళ్లు రాకుండా ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు ఉలవలు తింటే చాలా మంచిది. వీటిలోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుతుంది. ఓ కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచూ మూత్రంలో మంటతో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేయండి.

రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపర్చి హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. జ్వరంతో పాటు ఆయాసం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు ఉలవల కషాయం తాగడం మంచిది. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది. తక్కువ స్పెర్మ్ కౌంట్ కారణంగా సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్న పురుషులకు కూడా ఉలవలు తినటం ఉపయోగపడుతుంది. అలాంటి వారు నిపుణుల సలహా తీసుకున్న తర్వాత వీటిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!