Mango Flower : ఇది మీకు తెలుసా..? మామిడి పూత తింటే మందులే అవసరం లేదట..ఈ అనారోగ్య సమస్యలన్నీ ఫసక్..

మామిడి చెట్టులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మామిడితో పాటు దాని టెంక, మామిడి ఆకులు, బెరడు, పువ్వులు కూడా ఆరోగ్యానికి మంచిది. మామిడి ఆకులు, పండ్లను పూజలో ఉపయోగిస్తారు. కానీ మామిడి పువ్వులు కూడా ప్రయోజనాలను కలిగి ఉన్నాయని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. మామిడి పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పువ్వులను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.

Mango Flower : ఇది మీకు తెలుసా..? మామిడి పూత తింటే మందులే అవసరం లేదట..ఈ అనారోగ్య సమస్యలన్నీ ఫసక్..
Mango Flower
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 03, 2024 | 3:14 PM

వేసవికాలం వచ్చిందంటే చాలు.. మామిడి పండ్ల సీజన్‌ వస్తుంది. పండ్లలో రారాజైన మామిడి పండు ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.. అయితే, మామిడి పండ్లను తింటే గడ్డలు వస్తాయని, వేడి చేస్తాయని చాలామంది భయపడతారు. కానీ, అలాంటి భయలేవీ పెట్టుకోవద్దు.. రోజుకు ఒకటి లేదా రెండు కాయలు చొప్పున తినేవారికి ఎలాంటి సమస్య ఉండదు. పైగా ఎన్నో ప్రయోజనాలు కూడా. ఈ వేసవిలో మీ అందం, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవాలంటే.. తప్పకుండా మామిడి పండ్లను తినాల్సిందే. అంతేకాదు.. మామిడి చెట్టులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మామిడితో పాటు దాని టెంక, మామిడి ఆకులు, బెరడు, పువ్వులు కూడా ఆరోగ్యానికి మంచిది. మామిడి ఆకులు, పండ్లను పూజలో ఉపయోగిస్తారు. కానీ మామిడి పువ్వులు కూడా ప్రయోజనాలను కలిగి ఉన్నాయని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. మామిడి పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పువ్వులను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.

జీర్ణ సమస్య: వేసవిలో కొంతమందికి కడుపునొప్పి అనేది సాధారణ సమస్య. విరేచనాలు, అసిడిటీ, డీహైడ్రేషన్, అనేక ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మామిడి పువ్వును తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి మామిడి పువ్వులను తినండి. దీని కోసం మామిడి పువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత దీన్ని వడగట్టి ఉదయాన్నే తాగాలి. మామిడి పువ్వులు ప్రకృతిలో చల్లదనాన్ని కలిగి ఉంటాయి. కడుపులో వేడిని శాంతపరుస్తాయి.

కొలెస్ట్రాల్ తగ్గించేందుకు: ఇటీవలి కాలంలో తప్పుడు ఆహారం కొలెస్ట్రాల్ సమస్యకు దారి తీస్తోంది. కొలెస్ట్రాల్‌కు అతి పెద్ద కారణం ఫాస్ట్ ఫుడ్, క్రమరహిత జీవనశైలి. దీని వల్ల చాలా మందికి బరువు పెరిగే సమస్య ఉంటుంది. బరువు తగ్గాలంటే మామిడి పువ్వు రసం తాగండి. దీని రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కూడా అదుపులోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎసిడిటీ నుంచి ఉపశమనం: ఈ రోజుల్లో ఎసిడిటీ సమస్య సర్వసాధారణం. ఈ సమస్యను దూరం చేయడంలో మామిడి పువ్వు రసం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

డయాబెటిస్ నియంత్రణ : మామిడి పువ్వు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే అనేక లక్షణాలను కలిగి ఉంది. మీరు మామిడి పువ్వుల పొడిని తయారు చేసి, ప్రతిరోజూ ఉదయం ఒక చెంచా నీటిలో త్రాగవచ్చు. లేదా మామిడి పువ్వు రసం తీసి ఉదయాన్నే సేవించాలి. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

ముక్కుదిబ్బడ సమస్య: వేసవిలో చాలా మంది ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడుతుంటారు. వేడి వల్ల ఈ సమస్య వస్తే, మామిడి పువ్వు వాసన ఈ సమస్యను పరిష్కరించగలదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..