AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruits For Healthy Skin: చర్మ సౌందర్యానికి ఖరీదైన క్రీములు వద్దు..! ఇలాంటి చవకైన పండ్లు చాలు.. మెరిసే అందం మీ సొంతం..

శరీరానికి పోషణనిచ్చి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటన్నింటితో పాటు, పండ్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మ కాంతిని కూడా పెంచుతాయి. కాలుష్యం, ఒత్తిడి, ఇతర కారణాల వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు కనిపిస్తాయి. అయితే, ఈ సమస్యలను నివారించడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని పండ్ల వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది.

Fruits For Healthy Skin: చర్మ సౌందర్యానికి ఖరీదైన క్రీములు వద్దు..! ఇలాంటి చవకైన పండ్లు చాలు.. మెరిసే అందం మీ సొంతం..
Fruits
Jyothi Gadda
|

Updated on: Mar 03, 2024 | 2:50 PM

Share

Fruits For Healthy Skin: తాజా, జ్యుసి, సువాసన, సీజనల్ పండ్లు తినడానికి రుచికరంగా ఉంటాయనే వాస్తవం అందరికీ తెలుసు. అయితే ఇ పండ్లు కేవలం రుచికి సంబంధించినవి మాత్రమే కావు. వీటిని తీసుకోవడం వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. పండులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, మినరల్స్ చర్మానికి మేలు చేస్తాయి. శరీరానికి పోషణనిచ్చి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటన్నింటితో పాటు, పండ్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మ కాంతిని కూడా పెంచుతాయి. కాలుష్యం, ఒత్తిడి, ఇతర కారణాల వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు కనిపిస్తాయి. అయితే, ఈ సమస్యలను నివారించడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని పండ్ల వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది.

అరటి పండ్లు:

పండిన అరటిపండును తినడమే కాకుండా చర్మానికి అప్లై చేయడం వల్ల అనేక చర్మ సమస్యలు నయం అవుతాయి. అరటిపండులో ఉండే విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ బి చర్మంపై ముడతలు పడకుండా చేస్తుంది. చర్మాన్ని తేమగా, మృదువుగా మరియు కాంతివంతంగా మారుస్తుంది. ఫైబర్, విటమిన్లు, మినరల్స్, షుగర్, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్స్ నిండిన అరటి జీర్ణక్రియకు సహయపడుతుంది. బ్లడ్ లో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుందని. కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. వెయిట్ లాస్ కు కూడా బనానా మంచి ఫుడ్ అని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

నారింజ :

విటమిన్ సి నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లలో లభిస్తుంది. విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది చర్మపు మచ్చలను తగ్గిస్తుంది. ఛాయను మెరుగుపరుస్తుంది. కొల్లాజెన్ నిర్మాణం, ఐరన్ సంగ్రహణ, గాయాలను మాన్పించడం, మృదులాస్థి, ఎముకులు, పండ్లు బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ‘విటమిన్-సి’ శరీరానికి యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది.

బెర్రీలు:

బెర్రీలు చర్మం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. చర్మం ముడతలను తగ్గించడానికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. చర్మానికి కూడా మంచిది. స్ట్రాబెర్రీలు, మల్బరీలు, జామకాయలు, ద్రాక్షలు మరియు ఇతర రకాల బెర్రీలు తీసుకోవడం వల్ల చర్మం చాలా కాలం పాటు యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది.

బొప్పాయి:

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బొప్పాయిని తినడం వల్ల స్కిన్ టోన్‌ను సమం చేస్తుంది. బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది చర్మంపై ముడతలు, సన్నని గీతలు కనిపించకుండా చేస్తుంది. చర్మ సౌందర్యం తో పాటు జుట్టు ఆరోగ్యానికి బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. బొప్పాయి పండు తో ఫేస్ మాస్క్ వేసుకున్న, హెయిర్ మాస్క్ వేసుకున్న.. ముఖం మరియు జుట్టు ఎంతో నిగారింపుని సంతరించుకుంటాయి. బొప్పాయి మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..