ఆడవాళ్లకు అలర్ట్‌..! మహిళలు రోజుకు ఇన్ని గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలట.. లేదంటే అనర్థమే..!

నాణ్యమైన నిద్ర మహిళల్లో ఏకాగ్రత, ఉత్పాదకత, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. మానసిక శ్రేయస్సును ఇది ప్రోత్సాహిస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితి మీ కంట్రోల్​లో ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆడవాళ్లకు అలర్ట్‌..! మహిళలు రోజుకు ఇన్ని గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలట.. లేదంటే అనర్థమే..!
Sleeping Problems
Follow us
Jyothi Gadda

| Edited By: TV9 Telugu

Updated on: Mar 05, 2024 | 2:56 PM

మనకు తగినంత నిద్ర లేకపోతే, అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని మనందరికీ తెలుసు. మహిళలు తగినంత నిద్రపోకపోతే, ఇదే పరిస్ధితి చాలా రోజుల పాటు కొనసాగితే, వారు త్వరలోనే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇదొక్కటే కాదు, ఇదొక్కటే కాదు, పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ పరిశోధనలో ఒక మహిళ రాత్రిపూట 7 గంటలు నిద్రపోకపోతే, ఆమె గుండెపోటు, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని కనుగొనబడింది. నిద్రలేమి మహిళల్లో ఈ ప్రమాదాన్ని 70 శాతం పెంచుతుందని పరిశోధకులు వెల్లడించారు.

శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో 42 నుంచి 52 సంవత్సరాల వయస్సు గల 2,517 మంది మహిళలపై ఈ పరిశోధన నిర్వహించారు. 22 సంవత్సరాల పాటు వారిని ట్రాక్ చేశారు. వారు ఎలా నిద్రపోయారు? వారి గుండె పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను పరిగణలోకి తీసుకున్నారు.

ఈ పరిశోధనలో నిద్ర లేకపోవటం, తరచుగా నిద్ర భంగం కలిగించే మహిళల్లో ప్రతి నలుగురిలో ఒకరికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 70 శాతం ఉన్నట్లు తేలింది. అదే సమయంలో 5 గంటల కంటే తక్కువ నిద్రిస్తున్న మహిళల్లో, 72 శాతం గుండెపోటు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, ఆర్టరీ డిసీజ్ వంటి సమస్యలు కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

నిద్రలేమి, నిద్రభంగా కారణంగా మహిళ్లలో రక్తపోటు పెరగడం, ఇన్సులిన్ సమస్యలు పెరగడం, రక్తనాళాలకు హాని కలగడం వంటివి సంభవించవచ్చునని పరిశోధకులు గుర్తించారు. సరైన నిద్రలేకపోవడం వల్ల కూడా మహిళల్లో ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు.

ఇది ఆకలి సంకేతాలకు అంతరాయం కలిగిస్తుంది. మధ్య వయస్కులలో పెరుగుతున్న నిద్ర సమస్యలు, గుండె ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్క మహిళ రాత్రిపూట తప్పనిసరిగా కనీసం ఏడు గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. యువత కూడా నిద్ర విషయంలో ఎలాంటి అశ్రద్ధ వహించొద్దని చెబుతున్నారు.

నాణ్యమైన నిద్ర మహిళల్లో ఏకాగ్రత, ఉత్పాదకత, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. మానసిక శ్రేయస్సును ఇది ప్రోత్సాహిస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితి మీ కంట్రోల్​లో ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆకలిని కంట్రోల్​లో ఉంచి.. ఊబకాయం వంటి సమస్యలను తగ్గిస్తుంది. స్లీప్ మెమెరీ కన్సాలిడేషన్​లో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మీరు సమర్థవంతంగా పనులు చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. నిద్ర అనేది ఒత్తిడి సమస్యలను దూరం చేసి.. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిరాశ, ఆందోళన, ఇతర మానసిక సమస్యలను దూరం చేస్తుంది. సరైన నిద్ర మీ ఆలోచన తీరును మెరుగుపరుస్తుంది. ఇది తెలివైన నిర్ణయాలకు దారి తీస్తుంది.

ఇలా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోండిలా..

– నిపుణుల ప్రకారం, శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం, మంత్రం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి.

-వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేస్తే నిద్రలేమి సమస్య నయమవుతుంది.

-ఒత్తిడి కారణంగా నిద్రలేకపోతే, స్వీయ మసాజ్ సహాయంతో మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు.

-మీ ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి. నిద్రవేళకు 2 గంటల ముందు రాత్రి భోజనం చేయండి. టీ, కాఫీలకు దూరంగా ఉండండి.

– -నిద్రపోవడానికి 2 గంటల ముందు స్క్రీన్ ఆఫ్ చేసి, గోరువెచ్చని నీటితో స్నానం చేసి, గదిలోని లైట్లు ఆఫ్ చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..