దుబాయ్‌లోని ఎమిరేట్స్ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఏడుగురు వలస కూలీలు మరణించారు. మృతులలో జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ సలీమ్, గొల్లపల్లి తిరుపతి గౌడ్, అబ్దుల్ రఫీక్ ఉన్నారు. మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని బాధితుల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.