Health Tips: రాత్రిపూట పాలలో చిటికెడు ఈ పొడిని కలిపి తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..? ఖ‌చ్చితంగా తెలుసుకోండి

ఈ పొడిని పాలు కీళ్లు కండరాల నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. జాజికాయలో యాంటీ స్ట్రెస్ గుణాలు ఉన్నాయని, రాత్రిపూట పాలతో కలిపి తాగితే టెన్షన్, స్ట్రెస్, యాంగ్జయిటీ వంటి సమస్యలు దూరమై మనసుకు ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా..

Health Tips: రాత్రిపూట పాలలో చిటికెడు ఈ పొడిని కలిపి తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..? ఖ‌చ్చితంగా తెలుసుకోండి
Nutmeg And Milk
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 01, 2024 | 6:16 PM

పాలు తాగడం ఆరోగ్యానికి లాభదాయకంగా పరిగణించబడుతుంది. కానీ, కొన్నిసార్లు సాధారణ పాల కంటే పోషకాలు కలిపిన పాలు తాగడం వల్ల అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోభాగంగా జాజికాయ కలిపిన పాలను తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక రోగాలు శరీరానికి దూరంగా ఉంచుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచడంతో పాటు, మంచి నిద్రను అందించడంలో జాజికాయతో కలిపిన పాలు సహాయపడతాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. జాజికాయను పాలలో కలిపి తాగడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..

జాజికాయ.. ప్రతి వంటగదిలో తప్పక ఉండే మసాలా. ఆయుర్వేదంలో ఆరోగ్యానికి ఇది ఒక వరం అని చెప్పబడింది. జాజికాయను పాలలో కలిపి తాగడం వల్ల శరీరానికి ఎంతో శక్తిని అందించడంతో పాటు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జాజికాయను విటమిన్ల నిధి అని పిలుస్తారు. ఇందులో ఎక్కువ మొత్తంలో ఐరన్, అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం సహా అనేక రకాల పోషకాలు ఇందులో లభిస్తాయి. దీన్ని పాలలో కలిపి సేవిస్తే కీళ్లనొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందడమే కాకుండా అనేక రకాల పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

జాజికాయను పాలలో కలిపి తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జాజికాయలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నందున, పాలతో కలిపి తాగడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. రాత్రిపూట నిద్ర సరిగా పట్టని వారు, అలసటగా ఉన్నవారు ముఖ్యంగా జాజికాయ కలిపిన పాలు తాగాలి. ఇది మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. మంచి నిద్రను అందిస్తుంది. అలసటను తొలగించడంతో పాటు, జాజికాయతో కూడిన పాలు కీళ్లు కండరాల నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. జాజికాయలో యాంటీ స్ట్రెస్ గుణాలు ఉన్నాయని, రాత్రిపూట పాలతో కలిపి తాగితే టెన్షన్, స్ట్రెస్, యాంగ్జయిటీ వంటి సమస్యలు దూరమై మనసుకు ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..