AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cleaning Tips: బరువైన దుప్పట్లు నీళ్లు లేకుండా ఇంట్లోనే వాష్‌ చేసుకోవచ్చు..! ఎంత మురికిగా ఉన్నా నిమిషాల్లో మెరుపు ఖాయం..?

దుప్పటిని తడపడం వల్ల ఎక్కువ నీరు పీల్చుకోవడమే కాకుండా బరువు కూడా పెరుగుతుంది. అందులో నుంచి నీటిని పిండేయాలంటే..ఒకరిద్దరు సహాయం తీసుకోవాలి. శీతాకాలం, వర్షాకాలంలో ఎండ ఎక్కువగా ఉండదు. తడి దుప్పటి ఆరడానికి సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇక్కడ పేర్కొన్న ట్రిక్స్‌ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.

Cleaning Tips: బరువైన దుప్పట్లు నీళ్లు లేకుండా ఇంట్లోనే వాష్‌ చేసుకోవచ్చు..! ఎంత మురికిగా ఉన్నా నిమిషాల్లో మెరుపు ఖాయం..?
How to Wash a Fleece Blanket
Jyothi Gadda
|

Updated on: Mar 01, 2024 | 3:31 PM

Share

శీతాకాలం ముగిసింది.. ఇన్ని రోజులు వాడిన పెద్ద పెద్ద దుప్పట్లు, బ్లాకిట్లు ఇప్పుడు తిరిగి కబోర్డుల్లో భద్రపెట్టేయాల్సిన టైమ్‌ వచ్చేసింది. అయితే, భారీ బరువైన దుప్పట్లను ఉతకటం నిజంగా చాలా కష్టం. బయట వాషింగ్‌ సెంటర్లలో ఇచ్చి ఉతికిద్దామంటే చాలా ఖరీదు.. పైగా వాళ్లు ఎలాంటి నీటితో వాష్‌ చేస్తారో తెలియక చాలా మంది ఆందోళన పడుతుంటారు. అలాంటి వారికోసమే ఈ సమాచారం..! బరువైన దుప్పట్లను వాష్‌ చేసేందుకు సులువైన మార్గాన్ని మీకు తెలియజేస్తున్నాము. ఈ ట్రిక్ సహాయంతో మీరు సబ్బు, సర్ఫ్‌, నీళ్లు కూడా లేకుండానే సులభంగా మీ దుప్పట్లను వాష్‌ చేసుకోవచ్చు. దీంతో అవి శుభ్రంగా, బ్యాక్టీరియా రహితంగా మారతాయి. అందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

చలికాలంలో అందరం దుప్పట్లు ఉపయోగిస్తాం. తేలికపాటి చలిలో, తేలికపాటి దుప్పట్లు వెచ్చదనాన్ని అందిస్తాయి. తీవ్రమైన చలిలో, మందపాటి, భారీ దుప్పట్లు వెచ్చదనాన్ని అందిస్తాయి. వీటిని రోజూ వాడడం వల్ల మురికిగా తయారవుతాయి. ముఖ్యంగా దుప్పట్లు లేత రంగులో ఉంటే, మురికి చాలా త్వరగా కనిపిస్తుంది. అంతేకాకుండా, బాక్టీరియా ఉనికిని కూడా ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. దీని కారణంగా మనం కూడా అనారోగ్యానికి గురవుతాము. అటువంటి పరిస్థితిలో దానిని ఎలా శుభ్రం చేయాలనేది నిజంగా పెద్ద సవాలే. ఎందుకంటే దుప్పట్లను నీళ్లలో నానబెట్టిన తర్వాత అది మోయలేనంత బరువుగా మారుతుంది. అలాంటి సమయంలో మీ దుప్పట్లు ఉతికేయడానికి ఇక్కడ ఒక ఉపాయం ఉంది.. ఇది చాలా సులభం,పైగా మీ డబ్బును కూడా ఆదా చేస్తుంది.

ముందుగా మీ దుప్పటిని పూర్తిగా ఓపెన్‌ చేసి వెడల్పుగా పరుచుకోండి. ఆ తర్వాత..మీ వంటింట్లో ఉపయోగించే తినే సోడా తీసుకుని మొత్తం దుప్పటి మీద చల్లుకోండి. దీని కోసం మీరు స్ట్రైనర్‌ను ఉపయోగించవచ్చు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే.. బేకింగ్ సోడా చాలా మంచి క్లీనింగ్ ఏజెంట్. ఇది బ్యాక్టీరియాను నాశనం చేయడానికి పనిచేస్తుంది. బేకింగ్‌ సోడాను దుప్పటి మొత్తం చల్లుకున్న తర్వాత కొంత సమయం అలాగే వదిలేయండి.. ఆ తర ఉవాత దుప్పటిని రెండు వైపుల నుండి బ్రష్‌తో రుద్దుకోవాలి. ఇలా చేస్తే ఇది దుప్పటిపై ఉండే బ్యాక్టీరియా, ధూళిని శుభ్రపరుస్తుంది. దుప్పటి కూడా కొత్తగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వాసన వస్తే ఏం చేయాలి..?

చాలా సార్లు ఒకే దుప్పటిని ఎక్కువ మంది వ్యక్తులు ఉపయోగిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో, వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే దుప్పటి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. దీని నుంచి బయటపడాలంటే రోజ్ వాటర్ ను స్ప్రే బాటిల్ లో తీసుకుని దుప్పటిపై స్ప్రే చేయాలి. మీకు కావాలంటే దీనికి వెనిగర్ కూడా యాడ్‌ చేసుకోవచ్చు. అలా మొత్తం దుప్పటి నిండా స్ప్రే చేసిన తరువాత, దుప్పటిని కొంతసేపు ఎండలో ఆరబెట్టండి. ఎండలేకపోతే, బహిరంగ ప్రదేశంలో గాలికి ఆరేయండి. ఎటువంటి శ్రమ లేకుండా, ఉతకకుండా మీ దుప్పటి బ్యాక్టీరియా రహితంగా మారుతుంది.

దుప్పటిని తడపడం వల్ల ఎక్కువ నీరు పీల్చుకోవడమే కాకుండా బరువు కూడా పెరుగుతుంది. అందులో నుంచి నీటిని పిండేయాలంటే..ఒకరిద్దరు సహాయం తీసుకోవాలి. శీతాకాలం, వర్షాకాలంలో ఎండ ఎక్కువగా ఉండదు. తడి దుప్పటి ఆరడానికి సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇక్కడ పేర్కొన్న ట్రిక్స్‌ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..