Health: మెంతులు అతిగా తీసుకుంటే అనర్థాలు తప్పవ్.. వారికి డేంజర్
మెంతుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలాంటివి మరి. అందుకే మెంతులను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటే మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇంతకీ మెంతులు ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

మనం నిత్యం వంటల్లో ఉపయోగించే వాటిలో మెంతులు ప్రధానమైనవి. దాదాపు అన్ని వంటకాల్లో మెంతులను ఉపయోగిస్తారు. మెంతుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలాంటివి మరి. అందుకే మెంతులను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటే మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇంతకీ మెంతులు ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
* మెంతులను నీటిలో కలుపుకొని తాగడం వల్ల డయాబెటిక్ బాధితులకు మేఉలు జరుగుతుందని చెబుతుంటారు. అయితే మంచిది కదదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మెంతులు నీటిని మోతాదుకు మించి తీసుకుంటే చక్కెర స్థాయి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తు ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందని చెబుతున్నారు.
* మెంతిలో ఎక్కువగా సోడియం తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు తగ్గే అంకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ రక్తపోటుతో బాధపడేవారు వీలైనంత వరకు మెంతులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
* శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు మెంతి నీరు, మెంతులను తక్కువ తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. మెంతులు వేడి స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది.
* గర్భిణీలు మెంతులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మెంతులు వేడి స్వభావాన్ని కలిగి ఉన్న కారణంగా.. రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. పాలిచ్చే తల్లులు కూడా మెంతులకు దూరంగా ఉండాలని, ఇది కడుపు నొప్పికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
* మెంతులు అధికంగా తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. దీని కారణంగా, గ్యాస్, అజీర్ణం ఎదుర్కోవలసి ఉంటుంది. మలబద్ధకం సమస్య కూడా రావొచ్చు. కాబట్టి కడుపు సమస్యలు ఉన్నవారు మెంతికూర తినకూడదని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..




