- Telugu News Photo Gallery How to make tasty and Healthy Korrala Annam, check here is details in Telugu
Korrala Annam: కొర్రల అన్నం ఇలా చేయండి.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..
ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఇష్ట పడుతున్నారు. దీంతో తినే ఆహారంలో కూడా అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆహారంగా తీసుకునే వాటిల్లో చిరు ధాన్యాలు కూడా ఉంటాయి. వీటిల్లో కొర్రలు కూడా ఒకటి. కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయట పడొచ్చు. వీటిల్లో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో..
Updated on: Mar 02, 2024 | 9:30 PM

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఇష్ట పడుతున్నారు. దీంతో తినే ఆహారంలో కూడా అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆహారంగా తీసుకునే వాటిల్లో చిరు ధాన్యాలు కూడా ఉంటాయి. వీటిల్లో కొర్రలు కూడా ఒకటి. కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయట పడొచ్చు. వీటిల్లో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. కొర్రలతో ఏం చేసుకోవాలో చాలా మందికి తెలీదు. వీటిలో అన్నం చేసుకుని తింటే చాలా మంచిది. ఈ కొర్రల అన్నాన్ని తయారు చేయడం చాలా సులభం. ఈ కొర్రల అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా కొర్రలను శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని అన్నంగా వండుకునే ముందు 8 నుంచి 6 గంటల సేపు అయినా వడకట్టాలి. ఇప్పుడు నీటిని వడకట్టి.. గిన్నెలోకి తీసుకుని వేడి చేయాలి.

ఈ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు.. కొర్రలను వేసి బాగా మధ్యలో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటతో తిప్పుతూ ఉండాలి. ఇవి మెత్తగా దగ్గర పడే వరకూ ఉడికించాలి. కొర్రల అన్నం తయారు చేసుకోవడానికి ముందు.. కొర్రలను నానబెట్టాలి.

ఇలా నాన బెట్టుకోకపోయినా.. మెత్తగా ఉడికించుకోక పోయినా.. జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి.. ఖచ్చితంగా కొర్రలను నాన బెట్టుకోండి. దీని వల్ల అన్నం కూడా రుచిగా ఉంటుంది.




