Himabindu: తమిళంలో తెలుగమ్మాయి క్రేజ్.. వరుస ఆఫర్లు అందుకుంటున్న హిమబిందు..
అందంగా లేదు.. జనాలకు నచ్చదు.. ఆమెను మార్చేయండి అంటూ ఎంతోమంది విమర్శించారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటుంది తెలుగమ్మాయి హిమబిందు. ఈ అమ్మాయి టాలీవుడ్ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ తమిళంలో మాత్రం బుల్లితెరపై.. వెండితెరపై సత్తా చాటుతుంది. వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. తెలుగులో ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో 'మందాకిని' సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది.