Switch Boards Cleaning Tips: మురికి పట్టిన స్విచ్‌ బోర్డును ఇలా 2నిమిషాల్లోనే శుభ్రం చేసుకోవచ్చు..

ఇలా చేస్తే మీ ఇంట్లోని స్విచ్ బోర్డ్‌ను శుభ్రం చేయడం చాలా సులభం అవుతుంది. వాటిని శుభ్రపరిచేటప్పుడు, ఎల్లప్పుడూ తోలు చెప్పులు ధరించండి. లేదంటే, చెక్క పీటపై నిలబడి మాత్రమే ఈ పని చేయండి. మీటర్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతే స్విచ్ బోర్డును శుభ్రం చేయాలి. లేదంటే కరెంట్‌షాక్‌ తగిలే ప్రమాదం ఉంటుంది.

Switch Boards Cleaning Tips: మురికి పట్టిన స్విచ్‌ బోర్డును ఇలా 2నిమిషాల్లోనే శుభ్రం చేసుకోవచ్చు..
Switch Boards Cleaning Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 01, 2024 | 2:48 PM

ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ ఇంటికి అందంతో పాటు, సానుకూల శక్తిని తెస్తుంది. పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే దేవుడు కూడా ఉంటాడని మన పెద్దలు చెబుతారు. అందుకే కిచెన్, బాత్ రూం, బెడ్ రూమ్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. వీటిలో స్విచ్ బోర్డులు అనేవి నిత్యం శుభ్రం చేయకపోవటం వల్ల వాటిపై మురికి పేరుకుపోయి జిడ్డుగా మారి కనిపిస్తుంటాయి. వాటిని శుభ్రం చేయడం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో కొందరు దానిని సబ్బుతో శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఒక్కోసారి నీటి వల్ల విద్యుదాఘాతానికి గురవుతామనే భయం కూడా ఉంటుంది. డర్టీయెస్ట్ స్విచ్‌ని కూడా నిమిషాల్లో మెరిసేలా చేసే కొన్ని పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. మురికిగా ఉన్న స్విచ్ బోర్డ్‌ను క్లీన్ చేసే ఉపాయాలను ఇక్కడ తెలుసుకుందాం.

టూత్‌పేస్ట్‌, బ్రెష్‌తో స్విచ్‌ క్లీనింగ్..

మీరు మీ ఇంట్లో దంతాలను శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే టూత్‌పేస్ట్ సహాయంతో మీరు మీ ఇంట్లోని మురికి స్విచ్‌బోర్డులను శుభ్రం చేయవచ్చు. దీని కోసం మీకు పాత టూత్ బ్రష్ అవసరం. టూత్ బ్రష్ మీద కొద్దిగా పేస్ట్ తీసుకోండి. ఇప్పుడు బ్రష్‌ను స్విచ్‌పై నెమ్మదిగా రుద్దండి. స్విచ్ బోర్డ్ చాలా మురికిగా ఉండి, పసుపు రంగులోకి మారినట్లయితే, పేస్ట్‌ను కాసేపు స్వీచ్‌, బోర్డులకు అప్లై చేసి వదిలేయండి. 5 నిమిషాల తరువాత, శుభ్రమైన, పొడి టవల్ తో తుడవండి. స్విచ్ బోర్డ్ మరీ మురికిగా లేకుంటే వెంటనే శుభ్రం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నెయిల్ పెయింట్ రిమూవర్‌తో స్విచ్‌ని క్లీన్ చేయండి..

స్విచ్ బోర్డ్‌ను క్లీన్ చేయడానికి థిన్నర్ సహాయం కూడా తీసుకోవచ్చు. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఇది దొరుకుతుంది. దీని కోసం కాటన్ బాల్‌లో కొద్దిగా తీసుకుని, స్విచ్ బోర్డ్‌ను నెమ్మదిగా రుద్దాలి. తేలికగా అప్లై చేసిన వెంటనే స్విచ్‌లు శుభ్రం కావడం మీరు గమనిస్తారు.

స్విచ్‌బోర్డ్‌ క్లీనింగ్‌ కోసం బేకింగ్‌ సోడా..

ఇంట్లో ఉండే బేకింగ్ సోడా కూడా స్విచ్ బోర్డ్ శుభ్రం చేయడానికి చౌకైన మార్గం. దీని కోసం, ఒక చెంచా బేకింగ్ సోడాకు కొద్దిగా షాంపూ కలపండి. ఇప్పుడు ఒక గుడ్డ తీసుకుని దానికి కాస్త ఈ మిశ్రమాన్ని అంటించుకుని దానితో స్విచ్‌ను సున్నితంగా శుభ్రం చేయండి. స్విచ్‌లు కొత్తవిగా మారుతాయి.

షేవింగ్ క్రీమ్ ఉపయోగించండి…

షేవింగ్ క్రీమ్‌తో కూడా మీ మురికి స్విచ్‌లను శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం మీరు ఒక గిన్నెలో షేవింగ్ క్రీమ్ తీసుకుని, స్విచ్ బోర్డ్ మీద అప్లై చేయండి. కొంత సమయం తరువాత, టూత్ బ్రష్ తీసుకొని రుద్దండి. తర్వాత పొడి గుడ్డతో తుడవాలి. స్విచ్ బోర్డ్ లోపలికి క్రీమ్‌ వెళ్లకుండా జాగ్రత్త పాటించండి.

ఇప్పుడు మీరు స్విచ్ బోర్డ్‌ను శుభ్రం చేయడం చాలా సులభం అవుతుంది. వాటిని శుభ్రపరిచేటప్పుడు, ఎల్లప్పుడూ తోలు చెప్పులు ధరించండి. లేదంటే, చెక్క పీటపై నిలబడి మాత్రమే ఈ పని చేయండి. మీటర్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతే స్విచ్ బోర్డును శుభ్రం చేయాలి. లేదంటే కరెంట్‌షాక్‌ తగిలే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..