AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chapathi Viral Video: చపాతీలు చేసేందుకు అద్దిరిపోయే ఐడియా..! ఒకేసారి 5 చపాతీలు చేసే ట్రిక్.. సూపర్‌ ఉంది బ్రో..!!

నిపుణుల అభిప్రాయం ప్రకారం,..చపాతీలు రుచికరంగా ఉండటమే కాదు రైస్ కంటే చపాతీలు ఆరోగ్యానికి మంచివి. ఎందుకంటే ఒక చపాతీలో దాదాపు 104 కేలరీలు ఉంటాయి. అందుకే అన్నానికి బదులుగా వీటిని తినడం మంచిది. అంతేకాదు డైట్ పాటించేవారు కూడా వీటికే ప్రాముఖ్యతను ఇస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

Chapathi Viral Video: చపాతీలు చేసేందుకు అద్దిరిపోయే ఐడియా..! ఒకేసారి 5 చపాతీలు చేసే ట్రిక్.. సూపర్‌ ఉంది బ్రో..!!
Making Chapattis
Jyothi Gadda
|

Updated on: Feb 29, 2024 | 8:33 PM

Share

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో చపాతీ ఒకటి. చపాతీ అనేది దేశంలోని చాలా మందికి ఇష్టమైన ఆహారం. చపాతీ ప్రత్యేకత ఏమిటంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా తినొచ్చు. చపాతీలు రుచికరంగా ఉన్నప్పటికీ వాటిని తయారు చేయడం అంత తేలికైన పని కాదు. చపాతీలు ఎక్కువగా చేయాల్సి వచ్చినప్పుడు నీరసం వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి వారికోసం ఇక్కడ ఒక సులభమైన మార్గం ఉంది. విశేషం ఏమిటంటే ఐదు చపాతీలు ఒకేసారి చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఇలాంటి సూపర్‌ ట్రిక్‌ ఒకటి చూపించారు. ఈ వీడియో ఇప్పటికే వైరల్‌గా మారింది. ఒకేసారి 5 చపాతీలు చేయడానికి ఈ చిట్కాలను మీరు ట్రై చేయండి..

అయితే ఈ చపాతీలు చేయాలంటే పిండిని కలిపే విధానం చాలా ముఖ్యం. చపాతీ చేయడానికి ఉపయోగించే గోధుమ పిండి వదులుగా లేదంటే గట్టిగా ఉండకూడదు. కాబట్టి పిండిని బాగా మెత్తగా చేసి నూనె రాసి కాసేపు అలా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చపాతీ సైజును బట్టి ముద్దలుగా చేసిపెట్టుకోవాలి. అయితే, వైరల్‌ వీడియోలో ఒక మహిళ ఒకేసారి ఐదు చపాతీ ముద్దలను తీసుకుంది. చపాతీ తయారు చేసే పీటపై ముందుగా పొడిపిండిని జల్లుకుంది. ఇప్పుడు ఒకేసారి ఐదు చపాతీలు తీసుకుని వాటికి మధ్యలో పొడిపిండిని వేసి పీటపై పెట్టి మాములు చపాతీలు వత్తుకున్నట్లుగా రోలింగ్ పిన్ తో చకచకా చేసేసింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా విడదీస్తూ కాల్చుకుంది. ఇలా అయితే, కిచెన్ లో ఎక్కువ సమయం వృథా కాదు. అంతేకాదు అలసిపోకుండా ఉంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం,..చపాతీలు రుచికరంగా ఉండటమే కాదు రైస్ కంటే చపాతీలు ఆరోగ్యానికి మంచివి. ఎందుకంటే ఒక చపాతీలో దాదాపు 104 కేలరీలు ఉంటాయి. అందుకే అన్నానికి బదులుగా వీటిని తినడం మంచిది. అంతేకాదు డైట్ పాటించేవారు కూడా వీటికే ప్రాముఖ్యతను ఇస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పురుషులు, మహిళలు తినవలసిన చపాతీ పరిమాణం భిన్నంగా ఉంటుంది. మహిళలు ఉదయం 2 చపాతీలు, సాయంత్రం 2 చపాతీలు తినాలి. అదే సమయంలో, పురుషులు ఉదయం 3 చపాతీలు, సాయంత్రం 3 చపాతీలు తినాలని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌