Beauty Tips: ఎర్ర కందిపప్పుతో ఇలా చేస్తే.. నిగనిగలాడే చర్మంతో మెరిసిపోయే సౌందర్యం మీ సొంతం!

కాంతివంతమైన ముఖం సౌందర్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం మార్కెట్‌లో లభించే ఖరీదైన కెమికల్ ఉత్పత్తులను వినియోగిస్తుంటారు చాలా మంది. అయితే, వీటి వాడకంతో కొన్ని సార్లు సైడ్‌ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ, మీ వంటింట్లో లభించే కొన్ని రకాల పప్పులు, మసాలా దినుసులు మీకు సహజ సౌందర్యాన్ని అందిస్తాయి. ఆ కోవకు చెందినదే ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పు కేవ‌లం ఆరోగ్యానికే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మ పోషణ విషయంలో అద్భుతంగా పని చేస్తుంది. చర్మానికి అవసరం అయిన విటమిన్లు, మినరళ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మసూర్‌ పప్పుతో తయారు చేసుకునే కొన్ని ఫేస్‌ప్యాక్‌లను ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Feb 29, 2024 | 7:35 PM

తేనె, ఎర్ర కంది పప్పుతో ఫేస్‌ ప్యాక్‌ : ఎర్ర కంది పప్పులో మాయిశ్చరైజర్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తోడ్పడుతుంది. ఒక స్పూన్‌ ఎర్ర కంది పప్పు పొడిలో రెండు స్పూన్ల తేనెను వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి చిక్కటి ప్యాక్‌లా వేసుకోవాలి. దాదాపు15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి. ఎర్రకందిపప్పుని ఇలా ప్యాక్ వేస్తే త్వరలోనే ముఖంపై మచ్చలు, పిగ్మంటేషన్ మాయమవుతుంది.

1 / 5
ఎర్ర కందిపప్పు, బియ్యప్పిండి, పచ్చిపాలు: ఒక కప్పులో ఎర్ర కందిపప్పు పొడి , బియ్యప్పిండి సమపాలుగా తీసుకోవాలి. ఇందులో పచ్చి పాలువేసి ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని దాదాపు 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మకణాలలో పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది.

2 / 5
ఎర్ర కందిపప్పు, పాలు, బాదం నూనె: సగం కప్పు ఎర్ర కందిపప్పును రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీస్పూన్ పచ్చి పాలు, ఒక టీస్పూన్ బాదం నూనె కలిపి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మెరవడమే కాదు, మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి.

3 / 5
ఎర్ర కందిపప్పు, పాలు, పసుపు, కొబ్బరి నూనె: ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పొడి, రెండు టేబుల్ స్పూన్ ల పాలు, చిటికెడు పసుపు, మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతి వేళ్లతో ముఖానికి అప్లై చేసుకుంటూ సున్నితంగా మర్దన చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజు చేస్తే ముఖం తాజాగా ఉంటుంది.

4 / 5
ఎర్ర కందిపప్పు, పచ్చిపాలు: సగం కప్పు ఎర్ర కందిపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో పావు కప్పు పచ్చిపాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని సుమారు 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ట్యాన్ ని తొలగించి చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. అలాగే జిడ్డును తొలగించి మొటిమల్ని రాకుండా అడ్డుకుంటుంది.

5 / 5
Follow us
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!

దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు

కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు

కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి

మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ

మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ

పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం

కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి

నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!