Health Alert: అయ్యో రామా ఇదెక్కడి కర్మ..! క్యారెట్‌తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట..? జాగ్రత్త మరీ..

Carrot Juice side effects: ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూరగాయలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతేకాదు క్యారెట్‌, బీట్‌రూట్‌లు అందించే పోషకాలు అత్యధికం. అందుకే ప్రతి రోజూ వీటిని మన ఆహారంలో తప్పక చేర్చుకోవాలని నిపుణులు చెబుతుంటారు. క్యారెట్‌, బీట్‌రూట్‌ నేరుగా తినడానికి ఇష్టపడని వారు కూడా పోషక ప్రయోజనాలను పొందడానికి వాటిని జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మంచి ఆరోగ్యానికి అవసరమైన వివిధ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. క్యారెట్ జ్యూస్ […]

Health Alert: అయ్యో రామా ఇదెక్కడి కర్మ..! క్యారెట్‌తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట..? జాగ్రత్త మరీ..
Carrot Juice
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 29, 2024 | 5:51 PM

Carrot Juice side effects: ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూరగాయలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతేకాదు క్యారెట్‌, బీట్‌రూట్‌లు అందించే పోషకాలు అత్యధికం. అందుకే ప్రతి రోజూ వీటిని మన ఆహారంలో తప్పక చేర్చుకోవాలని నిపుణులు చెబుతుంటారు. క్యారెట్‌, బీట్‌రూట్‌ నేరుగా తినడానికి ఇష్టపడని వారు కూడా పోషక ప్రయోజనాలను పొందడానికి వాటిని జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మంచి ఆరోగ్యానికి అవసరమైన వివిధ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. క్యారెట్ జ్యూస్ చేసేటప్పుడు క్యారెట్ మాత్రమే కాకుండా మరికొన్ని పదార్థాలను కూడా చేర్చుకోవటం వల్ల క్యారెట్ పోషక విలువలు పెరుగుతాయి. అందుకే వైద్యులు, పోషకాహార నిపుణులు కూడా క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్‌లను తాగమని సిఫార్సు చేస్తున్నారు.

ఖాళీ కడుపుతో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చాలా పోషకాలు సులభంగా గ్రహించబడతాయి. క్యారెట్ జ్యూస్ శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాలను అందిస్తుంది. క్రియేటివ్ హెల్త్ బూస్టర్ అయిన క్యారెట్ జ్యూస్‌ని అతిగా తాగటం కూడా కొన్ని అనర్థాలకు దారి తీస్తుందని మీకు తెలుసా..? అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన క్యారెట్ జ్యూస్ శరీరానికి మేలు చేస్తుంది. కానీ, అదే క్యారెట్‌ జ్యూస్‌తో కలిగి అనారోగ్య సమస్యలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇంట్లో తయారుచేసిన క్యారెట్ జ్యూస్‌ ఆరోగ్యకరమైనది. కానీ స్టోర్‌లో విక్రయించే ప్రాసెస్ చేసిన క్యారెట్ జ్యూస్‌లు శరీరానికి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి. క్యారెట్ జ్యూస్‌ని ప్రాసెస్ చేయడానికి కొన్ని రసాయనాలు వాడుతుంటారు. అలాంటివి ఆరోగ్యకరమైన జ్యూస్‌ ప్రయోజనాన్ని దెబ్బతీస్తాయి. ఎక్కువ సెన్సిటివ్‌గా ఉండేవారిలో స్కిన్ రాషెస్, డయోరియా, అనాఫిలాక్టిక్ రియాక్షన్, హెచ్ఐవిస్, మరియు వాపులు వంటి అలర్జీ రియాక్షన్ ఉన్నవారికి క్యారెట్ అలర్జీని కలిగిస్తుంది. క్యారెట్ లో ఉండే అలర్జెన్స్ వల్ల సెన్సిటివ్ వ్యక్తుల్లో త్వరగా అలర్జీని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

క్యారెట్ రుచి వాతావరణంతో మారుతుంది. క్యారెట్‌ జ్యూస్‌లో రుచిలో పెద్ద గొప్ప లేకపోయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం మనం ఇంట్లో తయారుచేసిన క్యారెట్ జ్యూస్ తాగుతాము. కానీ, జ్యూస్‌ సెంటర్లలో విక్రయించే వారి వద్ద రుచి ప్రధాన అంశం కాబట్టి, కృత్రిమ రుచులను యాడ్‌ చేస్తుంటారు. ఇది క్యారెట్ జ్యూస్ ప్రయోజనాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు.. అన్‌పాశ్చరైజ్డ్ జ్యూస్‌లలో చిన్నపిల్లలకు, గర్భిణీలకు లేదా రోగనిరోధక శక్తి లేనివారికి హాని కలిగించే బ్యాక్టీరియా ఉండవచ్చు.

కొంత మంది తప్పనిసరిగా ప్రతి రోజూ క్యారెట్ తినడం అలవాటు చేసుకున్న వారిలో ఇరిటేషన్, నిద్రలేమి, నెర్వెస్ నెస్ మరియు వాటర్ బ్రాష్ వంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కుంటారు. క్యారెట్స్ ఎక్కువగా తినడం వల్ల క్యారెట్ లోని బీటా కెరోటిన్, కెరోటినాయిడ్స్ వల్ల చర్మ రంగులో మార్పు వస్తుంది. ఎల్లో కలర్ నుండి ఆరెంజ్ కలర్ లోకి మారుతుంది. అరచేతులు, ముఖం, చేతులు, పాదాల రంగులో మార్పు కనిపిస్తుంది.

క్యారెట్‌లో కొన్ని సహజ చక్కెరలు ఉంటాయి. స్వచ్ఛమైన క్యారెట్ రసంలో చక్కెర తక్కువగా ఉంటుంది. కానీ ప్రాసెస్ చేసిన రసాలలో తరచుగా సువాసన కోసం జోడించిన చక్కెరలు ఉంటాయి. దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యలు తలెత్తుతాయి. అలాగే, చిన్న పిల్లలకు క్యారెట్ ఎక్కువగా పెట్టడం సురక్షితం కాదు, అందువల్ల చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే పిల్లలకు అందివ్వాలి.

జ్యూస్ చేసేటప్పుడు ఇందులో అత్యంత పోషకమైన ఫైబర్ మొత్తాన్ని కోల్పోతాము. అందువల్ల, క్యారెట్లను జ్యూస్ చేసుకుని తాగడం, తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకేలా ఉండవు. అందుకే క్యారెట్ జ్యూస్ తాగే బదులు క్యారెట్ ను సలాడ్ గా లేదా పచ్చిగానే తీసుకోవడం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..