Health Tips: క్యారెట్‌తో క్యాన్సర్ మహమ్మారి దూరం.. ఇంకా ఏయే ప్రయోజనాలు కలుగుతాయంటే..?

Health Tips: నిత్యం తీసుకునే ఆహారంలో కురగాయలు, పండ్లు మాత్రమే కాక దుంపలు కూడా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, అన్ని రకాల సమస్యలు దూరంగా ఉంటాయి. దుంపలు శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే ఫిట్‌నెస్ సాధించాలనుకునేవారు పచ్చి క్యారెట్లు లేదా క్యారెట్ జ్యూస్ కూడా తాగుతుంటారు. క్యారెట్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల..

Health Tips: క్యారెట్‌తో క్యాన్సర్ మహమ్మారి దూరం.. ఇంకా ఏయే ప్రయోజనాలు కలుగుతాయంటే..?
Carrot Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 29, 2023 | 9:04 PM

Health Tips: నిత్యం తీసుకునే ఆహారంలో కురగాయలు, పండ్లు మాత్రమే కాక దుంపలు కూడా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, అన్ని రకాల సమస్యలు దూరంగా ఉంటాయి. పండ్లు, కురగాయల  మాదిరిగానే దుంపలు కూడా శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. ఇలాంటి పోషకాలను కలిగి ఉన్న దుంపల్లో క్యారెట్లు ప్రముఖమైనవి. అందుకే ఫిట్‌నెస్ సాధించాలనుకునేవారు పచ్చి క్యారెట్లు లేదా క్యారెట్ జ్యూస్ కూడా తాగుతుంటారు. క్యారెట్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి. ఇంతకీ అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. క్యాన్సర్ నిరోధిని: క్యారెట్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి, అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అంతేకాక ఇందులోని కెరోటినాయిడ్స్, ఆంథోసైనిన్స్ క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేసి ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
  2. మెరుగైన కంటి చూపు: ఎన్నో విటమిన్లను కలిగిన క్యారెట్ కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యారెట్‌లోని బీటా కెరోటిన్  శరీరంలో విటమిన్ ఎ స్థాయిని పెంచి కంటిచూపును మెరుగు పరుస్తుంది.
  3. మెరుగైన జీర్ణవ్యవస్థ: క్యారెట్‌ని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇందులోని ఫైబర్ కారణంగా ఫలితంగా మలబద్ధకం, అజీర్తి, కడుపు మంట, ఎసిడిటీ వంటి అన్ని రకాల కడుపు సమస్యలు తొలగిపోతాయి.
  4. షుగర్ కంట్రోల్: క్యారెట్‌లోని ఫైబర్ జీర్ణసమస్యలనే కాక రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను క్రమబద్ధీకరించడంలో కూడా పనిచేస్తుంది. ఈ కారణంగానే డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్ తాగాలని నిపుణులు చెబుతుంటారు.
  5. బలమైన ఎముకలు: బోలు ఎముకల సమస్యను తొలగించేందుకు శరీరానికి అవసరమైన విటమిన్ కె, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు క్యారెట్‌ ద్వారా లభిస్తాయి. ఈ పోషకాలు ఎముకలను బలోపేతం చేయడమే కాక వాటి సాంద్రతను కూడా పెంచుతాయి.
  6. రక్తహీనత దూరం: చాలా మంది యువతులు, గర్భిణీలకు ఎదురయ్యే సర్వసాధారణ సమస్య రక్తహీనత, అంటే శరీరానికి సరిపడినంత రక్తం లేకపోవడం. ఈ సమస్య ప్రాణాంతక పరిస్థితులకు కూడా దారితీయగలదు. ఈ క్రమంలో రక్తహీనతను దూరం చేసుకునేందుకు క్యారెట్ తీసుకోవచ్చు. క్యారెట్‌లో ఉండే ఐరన్ రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరిచి, రక్తహీనతను దూరం చేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ