AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Onion: పండంటి ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయ..! ఇలా వాడితే పోషకాల పవర్‌హస్‌..!!

పచ్చి ఉల్లిపాయల్లో ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది. ఇది ప్రేగులలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది.ఈ బాక్టీరియా మన జీర్ణశక్తిని పెంచగలదు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మొత్తం యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల ద్వారా మనం తీసుకునే ఆహారం నుండి మన శరీరంలోకి వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఉల్లిఘాటకు కళ్లలో నీరు వస్తే ఎలాంటి కంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

Raw Onion: పండంటి ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయ..! ఇలా వాడితే పోషకాల పవర్‌హస్‌..!!
Raw Onion
Jyothi Gadda
|

Updated on: Feb 29, 2024 | 4:14 PM

Share

కూర ఏదైనా సరే.. ఉల్లిపాయ లేనిదే వంట పూర్తికాదు.. ఉల్లిపాయ ఆహారం రుచిని కూడా పెంచుతుంది. అంతేకాదు.. ఆరోగ్యానికి పలువిధాలుగా మేలు చేస్తుంది. అందుకే అంటారు.. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి ఉండనే ఉంది.. సలాడ్స్‌లో, కొన్ని ఫుడ్స్‌కు స్టఫింగ్‌గా ఇవి బాగుంటాయి. రోజువారీ ఆహారంలో పచ్చి ఉల్లిపాయను తీసుకుంటే అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి ఉల్లపాయను ప్రతి రోజూ మీ భోజనంలో చేర్చుకుంటే.. గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. శరీరానికి అవసరమైన పొటాషియం, మాంగనీస్, కాపర్, విటమిన్ సి, విటమిన్ 6 ఉల్లిపాయల్లో పుష్కలంగా లభిస్తాయి. ఎముకల ఆరోగ్యానికి , అల్జీమర్స్, నరాల సంబంధిత సమస్యలను ఇవి దూరం చేస్తాయి. పచ్చి ఉల్లిపాయల్లోని క్వెర్సెటిన్, ఆర్గానిక్ సల్ఫర్ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి పని చేస్తాయి. ఇది మధుమేహం బాధితులకు మంచి చేస్తుంది.

పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ శీతాకాలంలో వైరస్, ఇతర క్రిముల వల్ల కలిగే అనేక ఆరోగ్య సమస్యల నుండి ఇది మనలను రక్షిస్తుంది. పచ్చి ఉల్లిపాయ మన ఆరోగ్య సమస్యలను చాలా వరకు పరిష్కరించగలదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పచ్చి ఉల్లిపాయల రెగ్యులర్ వినియోగం మన శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్ తో పోరాడటమే కాకుండా మన కణాలను ఇన్ఫ్లమేషన్ నుండి రక్షిస్తాయి. ఇది ప్రధానంగా గుండె జబ్బుల క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నందున, ఇది మన శరీరంలోని కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రధానంగా మన గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి పనిచేస్తుంది.

పచ్చి ఉల్లిపాయల్లో ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది. ఇది ప్రేగులలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది.ఈ బాక్టీరియా మన జీర్ణశక్తిని పెంచగలదు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మొత్తం యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల ద్వారా మనం తీసుకునే ఆహారం నుండి మన శరీరంలోకి వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఉల్లిఘాటకు కళ్లలో నీరు వస్తే ఎలాంటి కంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా