AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghee Benefits: ప్రతి రోజూ నెయ్యి వాడటం వల్ల కలిగే బెనిఫిట్స్ ఇవే!

నెయ్యి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రతి రోజూ నెయ్యి వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా నెయ్యి తింటే బరువు పెరుగుతారని అందరూ అనుకుంటారు. అందుకే చాలా మంది నెయ్యికి దూరంగా ఉంటారు. కానీ నిపుణులు మాత్రం ఇది అపోహ అని కొట్టి పారేస్తున్నారు. సరైన పరిమాణంలో ప్రతి రోజూ నెయ్యి తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతే కాదు వంటల్లో కూడా నెయ్యిని ఉపయోగిస్తే. ఎంతో ఆరోగ్యంగా..

Ghee Benefits: ప్రతి రోజూ నెయ్యి వాడటం వల్ల కలిగే బెనిఫిట్స్ ఇవే!
Ayurvedic Benefits Of Ghee
Chinni Enni
|

Updated on: Feb 29, 2024 | 4:02 PM

Share

నెయ్యి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రతి రోజూ నెయ్యి వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా నెయ్యి తింటే బరువు పెరుగుతారని అందరూ అనుకుంటారు. అందుకే చాలా మంది నెయ్యికి దూరంగా ఉంటారు. కానీ నిపుణులు మాత్రం ఇది అపోహ అని కొట్టి పారేస్తున్నారు. సరైన పరిమాణంలో ప్రతి రోజూ నెయ్యి తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతే కాదు వంటల్లో కూడా నెయ్యిని ఉపయోగిస్తే. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాదు రుచిగా కూడా ఉంటాయి. రెస్టారెంట్లు, హోటల్స్‌లో ఎక్కువగా నెయ్యి ఉపయోగించి చేస్తారు కాబట్టి రుచిగా ఉంటాయి. భారత దేశంలో ఎన్నో దశాబ్దాలుగా నెయ్యి వాడకం ఉంది. ప్రతి రోజూ కొద్ది పరిమాణంలో నెయ్యి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఇమ్యూనిటీని పెంచుతుంది:

ప్రతి రోజూ నెయ్యి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో వైరస్‌లు, బ్యాక్టీరియా, రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతే కాకుండా శరీరంలో రకరకాల పనులు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిగా ఉంటుంది. కొవ్వులో కరిగే విటమిన్లను నెయ్యి గుర్తించి లాగి.. అట్టి పెడుతుంది. పిల్లలకు ఇస్తే ఎంతో యాక్టీవ్‌గా, బలంగా ఉంటారు.

మల బద్ధకం సమస్య తగ్గుతుంది:

ప్రస్తుతం అనేక మంది రకరకాల ఆహారాలు తినడం వల్ల మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఇలాంటి వారు మెడిసిన్స్‌కు బదులు.. మూడు పూటలా కాస్త నెయ్యి తినడండి. ఇది మూత్ర నాళాలను బలంగా మారుస్తుంది. పేగుల్లో ఉండే సమస్యలను కూడా తరిమేసి.. మూత్రం ఈజీగా అయ్యేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

రిలీఫ్ నెస్ అందిస్తుంది:

ఒక్కోసారి పెద్దలు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీని వల్ల ఆందోళన ఎక్కువగా పెరిగిపోతుంది. అలాగే పిల్లలు కూడా పరీక్షల సమయంలో తెగ చదివేస్తూ ఉంటారు. దీని వల్ల వాళ్లు కూడా ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడి కారణంగా ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. దీని వల్ల కణాలు, కణజాలాలూ నాశనం అవుతాయి. ఇలా ఒత్తిడి నుంచి రిలీఫ్ నెస్ పొందాలంటే.. ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తింటే చాలా మంచిది.

చర్మం మెరుస్తుంది:

ప్రతి రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం అందంగా మెరుస్తూ ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు.. చర్మానికి రక్షణగా ఉంటాయి. చర్మంలో ఉండే విష పదార్థాలన్ని బయటకు తరిమేస్తాయి. చర్మానికి నెయ్యి నేచురల్ మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

రైలు టికెట్ ధరలు పెరుగుతున్నా.. ఇక్కడ మాత్రం అంతా ఫ్రీ..
రైలు టికెట్ ధరలు పెరుగుతున్నా.. ఇక్కడ మాత్రం అంతా ఫ్రీ..
ఫ్రీ బస్‌లో ఇక ఆధార్‌‌తో పనిలేదు మరి ఎలాగంటే..
ఫ్రీ బస్‌లో ఇక ఆధార్‌‌తో పనిలేదు మరి ఎలాగంటే..
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే ట్రైన్‌
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే ట్రైన్‌
ప్రగతి ఎకో సిస్టమ్‌తో రూ.85 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లు
ప్రగతి ఎకో సిస్టమ్‌తో రూ.85 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లు
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..