రేవంత్ సర్కార్‌ సంచలన నిర్ణయం.. గతేడాది ఇచ్చిన DSC నోటిఫికేషన్ రద్దు.. కారణం ఇదేనట!

వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా, మరో భారీ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు ముమ్మరం చేసింది. అయితే, గతేడాది సెప్టెంబర్ 6 న 5,089 పోస్టుల భర్తీకి DSC నోటిఫికేషన్ ఇచ్చింది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. అయితే,నాటి నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది.

రేవంత్ సర్కార్‌ సంచలన నిర్ణయం.. గతేడాది ఇచ్చిన DSC నోటిఫికేషన్ రద్దు.. కారణం ఇదేనట!
Cm Revanth
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 28, 2024 | 9:37 PM

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు దిశగా వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు ఉద్యోగాల నోటిఫికేషన్లకు తెరలేపింది. వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా, మరో భారీ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే గతేడాది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన DSC నోటిఫికేషన్‌ను రద్దు చేసింది ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం. కొత్తగా త్వరలో మరిన్ని పోస్టుల తో టీచర్ ఖాళీల భర్తీకి DSC నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

గతేడాది సెప్టెంబర్ 6 న 5,089 పోస్టుల భర్తీకి DSC నోటిఫికేషన్ ఇచ్చింది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. అయితే,నాటి నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. మరిన్ని ఉపాధ్యాయ ఖాళీల ను కలిపి తాజాగా అతి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని విద్యా శాఖ వెల్లడించింది. దాదాపు 11 వేల టీచర్ పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అప్లై చేసుకున్న వాళ్ళు మళ్లీ అప్లై చేసే పనిలేదని విద్యా శాఖ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..