AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Home Remedy : ఉదయాన్నే ఈ ఆకుని మరిగించిన నీళ్ళు తాగితే.. సాయంత్రానికి బ్లడ్ షుగర్ కంట్రోల్‌లోకి వస్తుంది..!

దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్‌ లాంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకులు బాగా పని చేస్తాయి. రోజూ వీటితో చేసుకున్న టీ తాగడం వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ ఆకుల్ని నీటిలో మరిగించి టీలా తాగడం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. పొట్ట ఆరోగ్యం బాగుపడి జీవ క్రియ మెరుగవుతుంది.

Diabetes Home Remedy : ఉదయాన్నే ఈ ఆకుని మరిగించిన నీళ్ళు తాగితే.. సాయంత్రానికి బ్లడ్ షుగర్ కంట్రోల్‌లోకి వస్తుంది..!
Bay Leaf Benefits
Jyothi Gadda
|

Updated on: Feb 28, 2024 | 6:54 PM

Share

ఇంతకుముందు మధుమేహం కేవలం వయసు పైబడిన వృద్ధులను ప్రభావితం చేసేది..కానీ, ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. జీవనశైలి, సరైన ఆహారం ద్వారా మాత్రమే దీనిని నియంత్రించవచ్చు. ఈ వ్యాధిలో బాధితుల రక్తంలో చక్కెర స్థాయి అనియంత్రితంగా పెరగడం ప్రారంభమవుతుంది. అందుకే మధుమేహాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, కొన్ని ఇంటి నివారణల సహాయం తీసుకోవచ్చు.ఈ రెమెడీస్‌లో పలావ్ ఆకు కూడా అద్భుతం చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో పలావు ఆకు ముఖ్యపాత్ర పోషిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో పలావ్ ఆకు ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

పలావ్‌ ఆకు.. మసాలా వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పలావ్ ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో ఉండే పాలీఫెనాల్స్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాదు శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దీని రెగ్యులర్ వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

డయాబెటిస్‌లో పలావ్ ఆకు ఎలా తీసుకోవాలి? :

ఇవి కూడా చదవండి

మధుమేహం అదుపులో ఉండాలంటే పలావు ఆకుల రసాన్ని సేవించవచ్చు. దీని కోసం ఒక పాన్లో ఒక గ్లాసు నీటిని వేడి చేయండి. ఈ నీటిలో 2-3 పలావ్ ఆకులను వేసి సుమారు 5 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడపోసి గోరువెచ్చగా తాగాలి. దీన్ని రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

బిర్యానీ ఆకు వినియోగంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితర శ్వాస కోశ సంబంధిత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్‌ లాంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకులు బాగా పని చేస్తాయి. రోజూ వీటితో చేసుకున్న టీ తాగడం వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ ఆకుల్ని నీటిలో మరిగించి టీలా తాగడం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. పొట్ట ఆరోగ్యం బాగుపడి జీవ క్రియ మెరుగవుతుంది.

బిర్యానీ ఆకులో ఉండే రుటిన్‌, కెఫిన్‌ ఆమ్లం తదితరాల వల్ల రక్త సరఫరా మెరుగై హైపర్‌ టెన్షన్‌ లాంటివి రాకుండా ఉంటాయి. గుండెపోటు లాంటి ప్రమాదాలు తగ్గుతాయి. క్యాన్సర్‌ కణాలను నివారించడంలో ఈ ఆకులు సహాయపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సొగసు చూడతరమా..జాలువారే గంటలా..అందమైన పూల గుత్తులు..
సొగసు చూడతరమా..జాలువారే గంటలా..అందమైన పూల గుత్తులు..
చదువుకోవటానికి వయస్సుతో పనిలేదని నిరూపించిన గృహిణి
చదువుకోవటానికి వయస్సుతో పనిలేదని నిరూపించిన గృహిణి
నేరెడు పండ్లు వీరికి విషంతో సమానం.. తింటే ప్రాణాలకే డేంజర్..
నేరెడు పండ్లు వీరికి విషంతో సమానం.. తింటే ప్రాణాలకే డేంజర్..
5 కోట్లతో తీస్తే 220 కోట్లకు పైనే.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
5 కోట్లతో తీస్తే 220 కోట్లకు పైనే.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య
మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య
డీజిల్‌పై సుంకం తగ్గింపు.. కేంద్రం కీలక నిర్ణయం
డీజిల్‌పై సుంకం తగ్గింపు.. కేంద్రం కీలక నిర్ణయం
'జెట్లీ' రివ్యూ.. సత్య, వెన్నెల కిషోర్ నవ్వుల ప్రయాణం ఎలా ఉందంటే?
'జెట్లీ' రివ్యూ.. సత్య, వెన్నెల కిషోర్ నవ్వుల ప్రయాణం ఎలా ఉందంటే?
వాటర్ ట్యాంక్‌లో ఇవి వేస్తే నాచు అనేదే ఉండదు.. పూర్వీకుల నేచురల్
వాటర్ ట్యాంక్‌లో ఇవి వేస్తే నాచు అనేదే ఉండదు.. పూర్వీకుల నేచురల్
వ్యభిచార కేసులో ఇరుక్కుని కెరీర్ నాశనం..
వ్యభిచార కేసులో ఇరుక్కుని కెరీర్ నాశనం..
గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. నేటి నుంచే..
గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. నేటి నుంచే..