Uses Of Turmeric: వేసవిలో పసుపు వాడకంతో చర్మంలో మార్పులు..! ఇలా వాడితే మరింత అందం
వేసవిలో, చర్మం నల్లబడుతుంది. అటువంటి పరిస్థితిలో, రంగును మెరుగుపరచడానికి పసుపు ఉపయోగపడుతుంది. పసుపులో రోజ్ వాటర్, శనగపిండి కలిపి చర్మానికి రాసుకోవడం వల్ల స్కిన్ మెరుస్తుంది. ముఖంలోని జిడ్డు తొలగి పోతుంది. ఇంటి దగ్గర కొంత స్థలం ఉంటే ఎవరైనా పసుపును పెంచుకుని ఉపయోగించవచ్చు.
వేసవిలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో సూర్యకాంతి, వేడి గాలులు కారణంగా చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోయి చర్మ సమస్యలను పెరుగుతాయి. ఎండ ఎక్కువై ముఖంలో ఎన్నో మార్పులు చూస్తుంటాం. అలాంటి సందర్భాల్లో ఎండ నుంచి అందాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. సూర్యుడి నుండి మీ అందాన్ని రక్షించడంలో పసుపు చాలా సహాయపడుతుంది. ఇది ఆరోగ్య పరంగా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ప్రాముఖ్యత తెలుసుకుని రోజూ వాడితే వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఉండొచ్చు. దాని కోసం ఇక్కడ ఒక చక్కటి పరిష్కారం ఉంది అదేంటో తెలుసుకుందాం..
వివాహాది శుభ కార్యక్రమాల్లో పసుపుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఇదొక్కటే కాదు నేటికీ వధూవరులకు పసుపు నూనెతో స్నానం చేయించే సంప్రదాయం కొనసాగుతుంది. పూర్వం స్త్రీలు ఇంటి చుట్టుపక్కల ఉండే మూలికలతో తమ అందాన్ని పెంచుకునేవారు. అప్పట్లో పసుపును ఎక్కువగా వాడేవారు. వేసవిలో ముఖంపై దుమ్ము, ధూళి ఎక్కువగా పేరుకుపోతుంది. కాబట్టి దానిని శుభ్రం చేయడానికి పసుపును ఉపయోగించండి. చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే వేసవిలో పసుపును ముఖానికి పట్టించుకోవడం మంచిది.
పసుపులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. వారానికి నాలుగు సార్లు పసుపును ముఖానికి రాసుకుంటే మచ్చలు పోతాయి. పసుపు ముక్కను పాల మీగడలో నానబెట్టి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మొటిమలు, ముఖంపై దురదలు నయమై ముఖం మెరిసిపోతుంది. అలాగే, రాత్రి నిద్రించడానికి ముందు పసుపును ఉపయోగిస్తే, చర్మం రోజంతా మెరుస్తూ ఉంటుంది. పసుపు వాడకం చర్మానికి కాంతినిస్తుంది. మొటిమలను, మచ్చలను పోగొట్టి, చర్మానికి మెరుపును తెస్తుంది. పాలను పసుపుతో కలిపి ప్యాక్ తయారు చేసి ముఖానికి రాసుకుంటే చర్మం శుభ్రపడుతుంది.
రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల రాత్రంతా చర్మాన్ని రిపేర్ చేస్తుంది. పసుపు మొటిమల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పసులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ముఖంపై మొటిమలను పోగొట్టడానికి సహాయపడుతుంది. ర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మంలోని నలుపును తొలగిస్తుంది.
వేసవిలో, చర్మం నల్లబడుతుంది. అటువంటి పరిస్థితిలో, రంగును మెరుగుపరచడానికి పసుపు ఉపయోగపడుతుంది. పసుపులో రోజ్ వాటర్, శనగపిండి కలిపి చర్మానికి రాసుకోవడం వల్ల స్కిన్ మెరుస్తుంది. ముఖంలోని జిడ్డు తొలగి పోతుంది. ఇంటి దగ్గర కొంత స్థలం ఉంటే ఎవరైనా పసుపును పెంచుకుని ఉపయోగించవచ్చు. ఎండిన పసుపు పొడి లేదా ఎండిన పసుపు దుకాణాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ, తాజా పసుపును ఉపయోగించడం మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..