AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మందుబాబులూ బీ అలెర్ట్.. మరింత జోరుగా డ్రంక్ అండ్ డ్రైవ్ లు

మందుబాబులు జర జాగ్రత్త.. ఇక నుంచి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవ్ ల నిర్వహించే సంఖ్య పెంచబోతోంది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ శాఖకు 50 బ్రీత్ ఎనలైజర్స్ ను డయాజియో కంపెనీ అందజేసింది. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరిగింది.

Hyderabad: మందుబాబులూ బీ అలెర్ట్.. మరింత జోరుగా డ్రంక్ అండ్ డ్రైవ్ లు
Drunken Drive Case
Balu Jajala
|

Updated on: Feb 28, 2024 | 10:00 PM

Share

మందుబాబులు జర జాగ్రత్త.. ఇక నుంచి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవ్ ల నిర్వహించే సంఖ్య పెంచబోతోంది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ శాఖకు 50 బ్రీత్ ఎనలైజర్స్ ను డయాజియో కంపెనీ అందజేసింది. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా, అడిషనల్ డీజీపీ రైల్వేస్ & రోడ్ సేఫ్టీ మహేష్ ఎం భగవత్ లకు డయాజియో కార్పొరేట్ ఎఫైర్స్ సీనియర్ జనరల్ మేనేజర్ రవి వర్మ, క్లస్టర్ హెడ్ సేల్స్ సీనియర్ జనరల్ మేనేజర్ అశ్వాంత్ బైసాని, మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ మేనేజర్ కే జై కృష్ణ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) ప్రోగ్రామ్స్ అసోసియేట్ మేనేజర్ రజత సరోహ తదితరులు బ్రీత్ అనలైజర్ లను అందజేశారు.

సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్త మాట్లాడుతూ.. దేశంలో ఎన్నో విభాగాలలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు నాణ్యత కలిగిన బ్రీత్ అనలైజర్ లను అందజేసేందుకు ముందుకు వచ్చిన డయా జియో కంపెనీ, ఎన్జీవో సిఎస్ఆర్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సామాజిక బాధ్యత కింద వారు తీసుకున్న చొరవ తో పోలీస్ సిబ్బంది సామర్థ్యం మరింతగా మెరుగవుతుందని, తద్వారా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ను నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పరికరాల ద్వారా కొంతమంది నైనా కాపాడగలిగితే ప్రయోజనం ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని దానిని నివారించేందుకు పోలీస్ సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని ఈ రకమైన ఆధునిక పరికరాల వల్ల పోలీస్ సిబ్బంది పనితీరు సామర్థ్యం పెరుగుతుందని తద్వారా ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.

అడిషనల్ డిజిపి రైల్వే లు & రోడ్ సేఫ్టీ మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ.. ప్రయాణికులు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ చేయడం వల్ల తమ ప్రాణాలే కాక ఇతరుల ప్రాణాలు కూడా కాపాడినవారు అవుతారని అన్నారు. ఆధునిక పరికరాల ద్వారా పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ నివారించాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ మాట్లాడుతూ… డ్రంక్ అండ్ డ్రైవింగ్ అరికట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నారని, నిర్విరామంగా ట్రాఫిక్ పోలీసులు తదనుగుణంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమనే ఉద్దేశంతో తన సంస్థ ముందుకెళ్తుందని డయా జియో కంపెనీ నిర్వాహకులు తెలియజేశారు. లక్ష్యాన్ని సాధించేందుకు పోలీస్ శాఖకు నాణ్యత కలిగిన బ్రీత్ అనలైజర్స్ ను అందించాలని భావిస్తున్నామన్నారు. దాదాపు 25 ప్రాంతీయ రవాణా కార్యాలయాలతో సమన్వయం చేసుకొని ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు.

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి