Medaram Jatara: మేడారంలో తిరుగువారం పండగ జరిపిన గిరిజనులు.. ఆదివారం నిర్వహించే వనభోజనాలతో జాతర పరిసమాప్తం

సమ్మక్క సారలమ్మ దేవతల వన ప్రవేశంతో జాతర ముగియగా.. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తిరుగువారం పండగ నిర్వహించారు. మొదటివారం గుడిమెలిగ పండుగతో గుడిశుద్ది కార్యక్రమాలు చేసి జాతరకు అంకురార్పణ చేశారు. మరుసటి వారం మండమెలిగ పండుగతో సమ్మక్క గుడిలోని పూజా సామాగ్రిని శుద్ధిచేసి రహస్య పూజలు నిర్వహించడంతో నాటి నుండి వనదేవతలకు మొక్కలు చెల్లించేందుకు భక్తులు పోటెత్తారు.

Medaram Jatara: మేడారంలో తిరుగువారం పండగ జరిపిన గిరిజనులు.. ఆదివారం నిర్వహించే వనభోజనాలతో జాతర పరిసమాప్తం
Thirugu Varam Festival
Follow us
Surya Kala

|

Updated on: Feb 29, 2024 | 6:52 AM

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో తిరుగువారం పండుగ ఆదివాసి ఆచార సాంప్రాయాల ప్రకారం నిర్వహించారు.. ఆదివాసీ ఆడపడుచులంతా సమ్మక్క పూజామందిరంలో పూజలు నిర్వహించారు.. తిరుగువారం పండుగ అనంతరం ఆదివారం నిర్వహించే వనబోజనాలతో జాతర పరిసమాప్తమైనట్టు గిరిజన పూజారులు తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతర ముగిసింది.  ఈనెల 21 నుండి 24 వరకు జరిగిన జాతర మహా వైనవంగ జరిగింది.. ఈ సారి జాతరలో సరికొత్త రికార్డ్ లు నమోదయ్యాయి

తాజాగా.. సమ్మక్క సారలమ్మ దేవతల వన ప్రవేశంతో జాతర ముగియగా.. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తిరుగువారం పండగ నిర్వహించారు. మొదటివారం గుడిమెలిగ పండుగతో గుడిశుద్ది కార్యక్రమాలు చేసి జాతరకు అంకురార్పణ చేశారు. మరుసటి వారం మండమెలిగ పండుగతో సమ్మక్క గుడిలోని పూజా సామాగ్రిని శుద్ధిచేసి రహస్య పూజలు నిర్వహించడంతో నాటి నుండి వనదేవతలకు మొక్కలు చెల్లించేందుకు భక్తులు పోటెత్తారు.

ఇవి కూడా చదవండి

ఆదివాసీ పూజార్లు ఇంటి ఆడపడుచులతో కలిసి పండుగ జరిపారు. ముందుగా సమ్మక్క పూజా మందిరాన్ని శుద్ధిచేసి ముగ్గులతో అలంకరించారు ఆడపడుచులు. సాంప్రదాయబద్దంగా సమ్మక్క పూజా సామాగ్రిని గిరిజన పూజారులు గుడిలో భద్రపరిచారు. దాంతో.. మేడారం జాతర ముగిసింది. తిరుగువారం పండుగ తర్వాత ఆదివారం నిర్వహించే వనభోజనాలతో జాతర పరిసమాప్తం అవుతుందన్నారు గిరిజన పూజారులు.

ఇక.. ఈ సారి జాతరకు రికార్డు స్థాయిలో కోటిన్నర మంది భక్తులు హాజరయ్యారు. జాతర ఆరంభంలోని మొదటివారం గుడిమెలిగ పండుగ, మరుసటి వారం మండమెలిగ పండుగ నిర్వహించి వనదేవతలకు మొక్కలు చెల్లించారు భక్తులు. ఆపై వనదేవతలు గద్దెలపై కొలువుదీరి నాలుగు రోజులపాటు భక్తులకు దర్శనమిచ్చారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..