ముఖంపై వెంట్రుకలు వేధిస్తున్నాయా..?ఈ రెమెడీ చేస్తే సరి! ఫేషియల్ హెయిర్ ఇంట్లోనే ఈజీగా రిమూవ్ చేయవచ్చు..!
వాక్సింగ్, ట్వీజింగ్, థ్రెడింగ్, లేజర్ వంటి వాటితో ముఖంపై వెంట్రుకలను వదిలించుకుంటుంటారు. ఇందుకోసం పార్లకు వెళ్లి డబ్బు ఖర్చుపెడుతుంటారు. అయితే, అవాంఛిత రోమాలను సహజంగా తొలగించడంలో సహాయపడే అనేక ఇతర చిట్కాలు ఉన్నాయి. వాటితో ఇంట్లోనే ముఖంపై వెంట్రుకలను ఈజీగా వదిలించుకోవచ్చు. అలాంటి హోం రెమిడీస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..
హార్మోన్ల లోపాలు, ఆరోగ్య సమస్యల కారణంగా చాలా మంది మహిళ ముఖంపై వెంట్రుకలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీంతో వారు నలుగురిలోకి వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. మహిళల్లో ముఖపై వెంట్రుకలు PCOD, థైరాయిడ్ లేదా ఇతర హార్మోన్ల సమస్యలు కారణం కావొచ్చు. వాక్సింగ్, ట్వీజింగ్, థ్రెడింగ్, లేజర్ వంటి వాటితో ముఖంపై వెంట్రుకలను వదిలించుకుంటుంటారు. ఇందుకోసం పార్లకు వెళ్లి డబ్బు ఖర్చుపెడుతుంటారు. అయితే, అవాంఛిత రోమాలను సహజంగా తొలగించడంలో సహాయపడే అనేక ఇతర చిట్కాలు ఉన్నాయి. వాటితో ఇంట్లోనే ముఖంపై వెంట్రుకలను ఈజీగా వదిలించుకోవచ్చు. అలాంటి హోం రెమిడీస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..
* ముఖంపై పెరిగిన వెంట్రుకలను తొలగించుకునేందుకు ఇంటి చిట్కాలు..
– పసుపు పేస్ట్:
> పసుపు పొడిని పాలతో కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి.
> పసుపు పేస్ట్‌ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయండి.
> దీన్ని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి స్క్రబ్ చేయండి.
> ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోండి.
> ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. ఫేషియల్ హెయిర్ తొలగుతుంది.
> పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందువల్ల, పసుపును చాలా కాలం నుండి ముఖ సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు.
– శనగపిండి రోజ్ వాటర్:
> శనగ పిండిని రోజ్ వాటర్ తో కలపండి.
> పేస్ట్‌లా తయారయ్యే వరకు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి
> దీన్ని మీ ముఖం అంతటా అప్లై చేయండి. ముఖ్యంగా అవాంఛిత రోమాలు పెరిగే ప్రదేశాలలో బాగా అప్లై చేయండి.
> ఈ పేస్ట్ ఆరిన తర్వాత ముఖం కడగాలి.
>శనగ పిండి ముఖంలోని అనవసర మురికిని తొలగిస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.
– గుడ్డు తెల్లసొన:
> గుడ్డులోని తెల్లసొన మాత్రమే తీసుకుని నరుగు వచ్చే వరకు బీట్ చేయండి.
> గుడ్డులోని తెల్లసొనపై పలుచని టిష్యూ లేదా పేపర్ టవల్ సున్నితంగా అదిమి ఉంచండి.
> ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. 15 నుండి 20 నిమిషాలు ఆరనివ్వండి.
> ఇది పూర్తిగా ఆరిన తర్వాత.. జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో తొలగించండి.
> గుడ్డులోని తెల్లసొనకు చర్మాన్ని బిగుతుగా మార్చే గుణాలు ఉంటాయి.
> ఇది అవాంఛిత రోమాలను తొలగించడానికి తోడ్పడుతుంది.
– బొప్పాయి, పసుపు మాస్క్:
> పండిన బొప్పాయిని మెత్తగా చేసి, చిటికెడు పసుపు పొడిని కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి.
> ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి.
> 15-20 నిమిషాల పాటు ఆరనివ్వండి.
> ఆ తర్వాత సున్నితంగా స్క్రబ్ చేసి.. గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోండి.
> బొప్పాయిలో ఎంజైములు ఉంటాయి. ఇవి ముఖంలోని వెంట్రుకలను తొలగించడానికి సహజమైన మార్గాన్ని అందిస్తాయి.
– షుగర్-లెమన్ స్క్రబ్:
> ఒక సాస్పాన్లో చక్కెర, నిమ్మరసం, వాటర్ సమాన భాగాలుగా మిక్స్ చేసి వేడి చేయండి.
> చక్కెర కరిగి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరక్ వేడి చేయండి.
> ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు.. జుట్టు పెరుగుదల దిశలో చర్మానికి అప్లై చేయండి.
> పేస్ట్ మీద క్లాత్ స్ట్రిప్ ఉంచండి, దీన్ని గట్టిగా నొక్కి.. ఆపై జుట్టు పెరిగిన వ్యతిరేక దిశలో ఫోర్స్‌గా లాగండి.
> మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి.
> నిమ్మకాయలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. చక్కెర ముఖంలోని అవాంఛిత మురికిని తొలగించడంలో సహాయపడుతుంది.
> ఇది వ్యాక్సింగ్ మాదిరిగానే ఉంటుంది. దీనిలో వ్యాక్స్‌కు బదులుగా చక్కెరను వాడుతుంటారు.
– ఓట్ మీల్, బనానా స్క్రబ్:
>పండిన అరటిపండ్లను ఓట్‌మీల్‌తో మిక్స్ చేసి మందపాటి పేస్ట్‌లా తయారు చేసుకోండి.
>ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేయండి.
> కొన్ని నిమిషాల పాటు.. సర్కిల్ మోషన్‌లో సున్నితంగా మసాజ్ చేయండి.
>ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి.
>ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. ఫేషియల్ హెయిర్ క్రమంగా తొలగుతుంది.
>ఓట్స్ ముఖంలోని మురికిని తొలగిస్తాయి, అరటిపండు చర్మానికి అవసరమైన ప్రొటీన్‌ను అందిస్తుంది.
– పచ్చి బొప్పాయి, తాజా అలోవెరా:
> పచ్చి బొప్పాయి గుజ్జును తాజా అలోవెరా జెల్‌తో మిక్స్ చేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోండి.
>ఈ పేస్ట్‌ను చర్మానికి అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు.. మసాజ్ చేయండి.
>దీన్ని 25 నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి.
>పచ్చి బొప్పాయిలో వెంట్రుకల కుదుళ్లను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లు ఉంటాయి.
>కలబంద జెల్ చర్మానికి ఉపశమనం, తేమను అందిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..