Pumpkin Flower Benefits : వీరి వీరి గుమ్మడి పండు..! ఈ పువ్వు ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదండోయ్..!!
ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. దాంతో గుమ్మడి కాయ, గింజలను విరివిగా తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అనేక ప్రయోజనాలతో కూడిన గుమ్మడి సూపర్ ఫుడ్‌గా అందరూ భావిస్తున్నారు. అయితే గుమ్మడికాయ, గింజలు మాత్రమే కాకుండా వాటి పూలు కూడా ఔషధగని అని మీకు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. గుమ్మడి పువ్వు తినడానికి కూడా రుచిగా ఉంటుందట.
గుమ్మడికాయ..ఇటీవలి కాలంలో ఆరోగ్య పరంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకప్పుడు గుమ్మడి కాయ అంటే కేవలం కొంతమంది మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. ఎక్కువ మంది దిష్టి కోసం మాత్రమే వాడేవారు. కానీ, ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. దాంతో గుమ్మడి కాయ, గింజలను విరివిగా తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అనేక ప్రయోజనాలతో కూడిన గుమ్మడి సూపర్ ఫుడ్‌గా అందరూ భావిస్తున్నారు. అయితే గుమ్మడికాయ, గింజలు మాత్రమే కాకుండా వాటి పూలు కూడా ఔషధగని అని మీకు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. గుమ్మడి పువ్వు తినడానికి కూడా రుచిగా ఉంటుందట. గుమ్మడికాయ పువ్వులలో తగినంత కాల్షియం, భాస్వరం, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందువలన ఈ పువ్వు మనకు అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. గుమ్మడి పువ్వులు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.
గుమ్మడి పూలతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున, గుమ్మడి పువ్వు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం జలుబు, దగ్గు మరియు ఇతర వైరల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. శరీరంలో ఇనుము శోషణను వేగవంతం చేస్తుంది. తద్వారా శరీరం ఇన్ఫెక్షన్ నుండి రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది. గుమ్మడి పువ్వులు తినడం వల్ల బాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య శరీరం నుండి దూరం అవుతుంది.
ఈ పసుపు పచ్చటి గుమ్మడి పువ్వు ఎముకలకు వరం. ఇందులో ఉండే కాల్షియం మరియు ఫాస్పరస్ ఎముకలను దృఢపరచడంలో సహాయపడతాయి. ఇది బోలు ఎముకల వ్యాధికి కూడా మేలు చేస్తుంది. ఇది దంతాలను కూడా బలపరుస్తుంది. గుమ్మడి పూలను తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. గుమ్మడికాయ పువ్వు జీర్ణవ్యవస్థకు కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది గ్యాస్, మలబద్ధకం, అనేక జీర్ణ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
గుమ్మడి పువ్వులలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళకు ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇందులో ఉండే పోషకాలు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుమ్మడి పూల వాడకంతో కళ్లు పొడిబారడం, రాత్రి అంధత్వం వంటి సమస్యలు తగ్గుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..