Oversleep: అతిగా నిద్రపోతున్నారా? అలర్ట్ అవ్వాల్సిందే.. ఇలాంటి వ్యాధుల ఎఫెక్ట్‌ ఎక్కువేనట..!

Oversleep: ఆరోగ్యంగా ఉండేందుకు తగినంత నిద్ర అవసరం. కానీ, అతినిద్ర అనారోగ్యానికి అనర్థం అని హెచ్చరిస్తున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే.. తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్ర అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. అతి నిద్ర హైపర్ సోమ్నియాతో బాధపడుతున్నారనేందుకు సంకేతమని వివరిస్తున్నారు. ఇది శరీరం, మనసుపై దీర్ఘకాలిక చెడు ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. ఎక్కువ నిద్ర మనకు అనేక సమస్యలను కలిగిస్తుంది. ఇది ఒళ్లు నొప్పులు, మోకాళ్ల-కీళ్ల నొప్పులు, బద్ధకం మొదలైన వాటికి కారణమవుతుంది.

Jyothi Gadda

|

Updated on: Feb 29, 2024 | 6:56 PM

మధుమేహం: రోజువారీ అవసరాల కంటే ఎక్కువ లేదా తక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. అతిగా నిద్రపోవడం వల్ల మానసికంగా, శారీరకంగా ప్రభావం చూపుతుంది.

1 / 5
గుండె సంబంధిత వ్యాధులు: అధిక నిద్ర సాధారణ దుష్ప్రభావం.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణం. ఎక్కువ నిద్రపోయే వ్యక్తుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అతిగా నిద్రపోతే అంతర్గత అవయవాలైన కాలేయం, పేగుల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

2 / 5
ఊబకాయం: నిద్రలేమి, అతి నిద్ర రెండూ ఊబకాయానికి దారితీస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పడుకున్నప్పుడు ఓ మనిషి ఖర్చు చేసే కేలరీలు చాలా తక్కువ. అందువల్ల రోజుకు 9 నుంచి 10 గంటల పాటు పడుకునే వారు మిగతావారితో పోలిస్తే 5 కేజీల బరువు పెరుగుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

3 / 5
డిప్రెషన్: నిద్ర, డిప్రెషన్ రెండూ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తి ఎక్కువగా నిద్రపోతుంటారు. దీని వల్ల మాత్రమే కాదు, దీని కారణంగా,నిద్ర వ్యవస్థ చెదిరిపోతుంది. ఈ కారణంగా ఎక్కువ నిద్ర డిప్రెషన్ సమస్యను పెంచుతుంది.

4 / 5
తలనొప్పి, వెన్నునొప్పి : సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. పగటిపూట ఎక్కువగా నిద్రపోయేవారు, రాత్రిపూట సరిగ్గా నిద్రపోని వారు ఉదయం తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us