- Telugu News Photo Gallery What happens if you dream of someone dead? check here is details in Telugu
Spiritual: కలలో ఎవరైనా చనిపోయినట్టు కలలు వస్తే ఏం జరుగుతుంది?
సాధారణంగా నిద్రలో అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. కలలో అనేక వంటివి కనిపిస్తూ ఉంటాయి. నిద్రలో ఏవోవే కలలు వస్తూ ఉంటాయి. కానీ కలలో వచ్చే కొన్ని సంఘటనలు.. భవిష్యత్తులో జరిగే వాటికి కొన్ని సంకేతాలను ఇస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోండి. ఒక్కోసారి కలలో ఎవరో చనిపోయినట్టు వస్తాయి. ఇలాంటి చావు కలలు వస్తే.. చాలా మంది భయపడి పోతూ ఉంటారు. ఇంకొంత మంది బాగా ఏడుస్తూ ఉంటారు. అసలు కలలో..
Updated on: Feb 29, 2024 | 6:20 PM

సాధారణంగా నిద్రలో అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. కలలో అనేక వంటివి కనిపిస్తూ ఉంటాయి. నిద్రలో ఏవోవే కలలు వస్తూ ఉంటాయి. కానీ కలలో వచ్చే కొన్ని సంఘటనలు.. భవిష్యత్తులో జరిగే వాటికి కొన్ని సంకేతాలను ఇస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోండి. ఒక్కోసారి కలలో ఎవరో చనిపోయినట్టు వస్తాయి.

ఇలాంటి చావు కలలు వస్తే.. చాలా మంది భయపడి పోతూ ఉంటారు. ఇంకొంత మంది బాగా ఏడుస్తూ ఉంటారు. అసలు కలలో ఇలా కనిపించడానికి అర్థం ఏంటి? ఇలాంటి సంకేతాలు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలా చావు కలలు రావడం మంచిదని స్వప్న శాస్త్రం చెబుతోంది. రోగాలతో బాధ పడుతున్న వ్యక్తి చనిపోయినట్టు కలలో వస్తే.. అది శుభ ప్రదమట. ఇలాంటి కల పడితే ఆ వ్యక్తి ఆరోగ్యం మెరుగు పడుతుందని అర్థం వస్తుందట.

అలాగే కలలో మీరు చనిపోయినట్టు కల వస్తే.. అది కూడా చాలా మంచిదేనట. ఈ కల వల్ల ఎక్కువ కాలం జీవించబోతారని అర్థమట. ఇలా కల పడితే ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కలలో మీరే చనిపోయినట్టు డ్రీమ్ వస్తే.. మీ జీవితంలో అన్ని కష్టాలు ముగియబోతున్నాయని అర్థం వస్తుందట.

మీకు కలలో ముత్తాతలు కనిపిస్తే.. మీ కోరికలు ఏవో నెరవేరలేదని అర్థాన్ని సూచిస్తుందట. అదే మీరు కలలో అనారోగ్యంతో కనిపిస్తే.. అది అశుభంగా పరిగణించబడుతుందని స్వప్న శాస్త్రం చెబుతుంది.




