AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: 12 బాలుడికి అరుదైన వ్యాధి.. చికిత్స కోసం 80,00,000రూపాయల ఖరీదైన ఇంజెక్షన్..

కూర్చుంటే లేవలేని పరిస్థితి.. నిలబడితే కూర్చోలేని దుస్థితి.. దీంతో ప్రతి పనికి తల్లిదండ్రులు మీద ఆధారపడాల్సి పరిస్థితి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు బాషా తీసుకొని వైద్యుల చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. అయితే ఈ మందు ప్రస్తుతం మార్కెట్ 80,00,000 ధర పలుకుతుందన్నారు. నాలుగు దఫాలుగా ఇచ్చే ఈ మందు ద్వారా అతని వ్యాధిని తగ్గించవచ్చని చెప్పారు. అయితే తాపీ మేస్త్రీగా పనిచేసే యాసిన్ వద్ద అంత డబ్బులేదు. దీంతో దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నారు.

Andhra Pradesh: 12 బాలుడికి అరుదైన వ్యాధి.. చికిత్స కోసం 80,00,000రూపాయల ఖరీదైన ఇంజెక్షన్..
Boy Suffered With Rare Disease
T Nagaraju
| Edited By: Jyothi Gadda|

Updated on: Feb 29, 2024 | 8:33 PM

Share

గుంటూరు, ఫిబ్రవరి 29; అంతు చిక్కని వ్యాధి ఆ బాలుడిని ఆగమాగం చేస్తుంది. కూర్చుంటే లేవలేడు…లేస్తే కూర్చోలేడు… అతని దుస్థితి చూసి ఆ పేద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చికిత్స చేయించేందుకు అనేక మంది వైద్యులను సంప్రదించారు. అయితే అరుదైన వ్యాధికి చికిత్స చేయాలంటే కోటి రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో వారికి గుండె ఆగినంత పనైంది. అయితే దాతలు ముందుకొచ్చి వైద్యం అందిస్తారేమోన్న ఆశతో ఇంకా వారిద్దరూ జీవిస్తున్నారు.

ఫిభ్రవరి 29 రేర్ డిసీజ్ డే… ప్రపంచలోని అరుదైన వ్యాధులను గుర్తించేందుకు ఉన్న ఒక రోజు. గుంటూరులోని గంటా శ్రీనివాస్ ఆసుపత్రిలో అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న బాలుడికి రోగ నిర్ధారణ ఈ రోజే చేయడం జరిగింది. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన యాసిన్, షర్మిలా దంపతలుకు ఇద్దరూ పిల్లలు.. ఖాదర్ బాషా పెద్దవాడు… వయస్సు పదహారేళ్లు. పన్నెండు ఏళ్లు వచ్చే వరకూ అందరి పిల్లలు లాగే ఖాదర్ భాషా రోజు స్కూలుకు వెళ్లేవాడు.. అందరితో కలిసి మెలిసి ఉండేవాడు. అయితే, ఒక రోజు స్కూల్లో పడిపోయాడు. అప్పటి నుండి బాషా ప్రవర్తనలో మార్పులు రావడం మొదలయ్యాయి.. కూర్చుంటే లేవలేని పరిస్థితి.. నిలబడితే కూర్చోలేని దుస్థితి.. దీంతో ప్రతి పనికి తల్లిదండ్రులు మీద ఆధారపడాల్సి పరిస్థితి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు బాషా తీసుకొని వైద్యుల చుట్టూ తిరగడం మొదలు పెట్టారు.

తాపీ మేస్త్రిగా పనిచేసే యాసిన్ కు వైద్యం చేయించడం గగనమై పోతుంది. అసలు వ్యాధి ఏంటో తెలిస్తే చాలు అనుకునే పరిస్థితికి వచ్చేశారు. ఈ క్రమంలోనే గంటా శ్రీనివాస్ వద్దకు వచ్చారు. ఆయన రోగిని అన్నివిధాలుగా పరీక్షించిన తర్వాత బాషాకు వచ్చి వ్యాధి స్పైనల్ మస్కూలార్ ఎట్రోపిగా గుర్తించారు. జన్యుపరంగా వచ్చే వ్యాధి కావటంతో నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. అయితే ఎస్ఎంఏగా వైద్య పరిభాషలో చెప్పే ఈ వ్యాధికి మందు ఉన్నట్లు డాక్టర్ గంటా శ్రీనివాస్ చెప్పారు. నుసినెర్సన్ అనే మందు ఇవ్వడం ద్వారా రోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ మందు ప్రస్తుతం మార్కెట్ 80,00,000 ధర పలుకుతుందన్నారు. నాలుగు దఫాలుగా ఇచ్చే ఈ మందు ద్వారా అతని వ్యాధిని తగ్గించవచ్చని చెప్పారు. అయితే తాపీ మేస్త్రీగా పనిచేసే యాసిన్ వద్ద అంత డబ్బులేదు. దీంతో దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..