Strawberry Juice: స్ట్రాబెర్రీ జ్యూస్ తాగితే ఎన్ని బెనిఫిట్సో తెలుసా.. అస్సలు మిస్ చేయకండి!

స్ట్రాబెర్రీల గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. వీటితో అందంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్ట్రాబెర్రీలో అనేక పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ తినడం వల్ల శరీరంలో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను మెరుగు పరుస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, పోషకాలు అనేవి ఫుష్కలంగా ఉంటారు. కంటి చూపు బలంగా ఉండేందుకు కూడా స్ట్రాబెర్రీలు బాగా..

Strawberry Juice: స్ట్రాబెర్రీ జ్యూస్ తాగితే ఎన్ని బెనిఫిట్సో తెలుసా.. అస్సలు మిస్ చేయకండి!
Strawberry
Follow us
Chinni Enni

|

Updated on: Mar 01, 2024 | 1:59 PM

స్ట్రాబెర్రీల గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. వీటితో అందంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్ట్రాబెర్రీలో అనేక పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ తినడం వల్ల శరీరంలో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను మెరుగు పరుస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, పోషకాలు అనేవి ఫుష్కలంగా ఉంటారు. కంటి చూపు బలంగా ఉండేందుకు కూడా స్ట్రాబెర్రీలు బాగా ఉపయోగ పడతాయి. అయితే కొంత మందికి స్ట్రాబెర్రీలు తినడం నచ్చదు. అలాంటి వారు జ్యూస్ కూడా తగొచ్చు. వీటితో తయారు చేసే జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మరి స్ట్రాబెర్రీ జ్యూస్‌తో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఎముకలు బలంగా ఉంటాయి:

స్ట్రాబెర్రీలో క్యాల్షియం, మెగ్నీషియం వంటివి మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచేందుకు బాగా సహాయ పడతాయి. స్ట్రాబెర్రీలు తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.

వెయిట్ లాస్:

వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా స్ట్రాబెర్రీలు సహాయ పడతాయి. స్ట్రాబెర్రీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తినడం వల్ల ఎక్కువగా ఆకలి కూడా వేయదు. దీంతో సులభంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. అంతే కాకుండా స్ట్రాబెర్రీల్లో కేలరీలు అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి బరువు తగ్గేందుకు బాగా హెల్ప్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

గుండె సమస్యలు:

స్ట్రాబెర్రీల్లో అధిక ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫెనాల్స్ ఉండటం వల్ల అలెర్జీలను నివారిస్తాయి. దీని వల్ల రక్త సరఫరగా కూడా మెరుగవుతుంది. స్ట్రాబెర్రీ జ్యూస్ తాగడం వల్ల గుండెకు కూడా రక్త సరఫరా బాగా జరుగుతుంది. ముఖ్యంగా స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి ఉపయోగ పడతాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది.

మెదడు ఆరోగ్యం:

స్ట్రాబెర్రీల జ్యూస్ తాగడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలకు ఎలాంటి హాని కలగకుండా సహాయ పడతాయి. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!