AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సిన ఈ భూలోక స్వర్గానికి వెళ్లండి.. కళ్లు చెదిరే అందాలకు చిరునామా!!

ఇక్కడి బ్యాక్ వాటర్‌ అందాలు, అందమైన ప్రకృతి, పక్షుల కిలకిలలు, జలపాతాల సవ్వడి, చరిత్ర, ఫుడ్ ని ఇష్టపడే వారికి ఇది పచ్చని స్వర్గధామంలాంటిది. తేయాకు తోటల సువాసన, ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అంతేకాదు, కొత్తగా పెళ్లయిన జంటలకు ఇది ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశంగా నిలుస్తోంది.

సమ్మర్‌ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సిన ఈ భూలోక స్వర్గానికి వెళ్లండి.. కళ్లు చెదిరే అందాలకు చిరునామా!!
Tourist Places In Kerala
Jyothi Gadda
|

Updated on: Mar 03, 2024 | 2:50 PM

Share

భారతదేశంలోని కేరళ రాష్ట్రం ఎంతో అందమైన ప్రదేశం. ఇక్కడికి వెళ్లిన తర్వాత మిమ్మల్నీ మీరు మర్చిపోతారు. ఇక్కడి పర్యావరణం, రుచికరమైన ఆహారం ఈ ప్రదేశాన్ని మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. అందుకే కేరళను గాడ్స్ ఓన్ ల్యాండ్.. దేవుడి సొంత ప్రాంతంగా పిలుస్తారు. అందుకు తగినట్టుగానే ప్రపంచంలో చూడదగ్గ 52 బెస్ట్ ప్రాంతాల్లో భారత్ నుంచి చోటు సంపాదించుకున్న ఏకైక ప్రాంతం కేరళ. ఇక్కడి పర్యాటకం పూర్తిగా పర్యావరణంతో ముడిపడి ఉంది. ఓవైపు పూర్తిగా అరేబియా సముద్రం, మరోవైపు తమిళనాడు, కర్నాటక సరిహద్దులతో కేరళ, అత్యంత ఆహ్లాదంగా ఉండే పశ్చిమ తీర రాష్ట్రం. కేరళలోని అలెప్పీని వెనిస్ ఆఫ్ ఇండియా అంటారు. వెనిస్ అందం లాంటిదని అర్థం..వెనిస్‌ లాగే అలెప్పీ కూడా చాలా అందంగా ఉంటుంది. పర్యాటక కేంద్రంగా పాపులర్ కూడా. అలెప్పీ బీచ్, సరస్సు, హౌస్ బోట్ వసతికి చాలా ప్రసిద్ధి చెందింది.

కేరళ రాజధాని, రాష్ట్రంలోని అతిపెద్ద నగరాలలో ఒకటి తిరువనంతపురం.. దీనినే త్రివేండ్రం అంటారు. ఇది ఆకర్షణీయమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అత్యంత సంపన్న ఆలయం పద్మనాభస్వామి గుడి కూడా ఇక్కడే ఉంది. కేరళలోని త్రిసూర్ నగరం బంగారం, వజ్రాభరణాలకు ప్రసిద్ధి చెందింది. కేరళలో ఉపయోగించే దాదాపు 70శాతం ఆభరణాలు ఇక్కడే తయారు చేయబడతాయి. ఇక్కడ అత్యంత పరిశుభ్రమైన బీచ్‌లలో చావక్కాడ్ బీచ్, నాటికా బీచ్, వడనపల్లి బీచ్, స్నేహతీరం బీచ్ మరియు పెరియంబలం బీచ్ ఉన్నాయి. ఇవి అత్యంత పరిశుభ్రమైన బీచ్‌లు.

కేరళలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి వయనాడ్. కాలుష్య రహిత వాయనాడ్ పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రదేశం. దీంతో పాటు,.. మడ అడవులు, పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలతో నిండి ఉన్న కుమరకోమ్ మరో అద్భుతం. ఇక్కడి బ్యాక్ వాటర్‌ అందాలు, అందమైన ప్రకృతి, పక్షుల కిలకిలలు, జలపాతాల సవ్వడి, చరిత్ర, ఫుడ్ ని ఇష్టపడే వారికి ఇది పచ్చని స్వర్గధామంలాంటిది. ఇది కేరళ రాష్ట్రంలోని అతిపెద్ద సరస్సు అయిన వెంబనాడ్ సరస్సు సమీపంలో ఉంది. కుమరకోమ్‌లో హౌస్‌బోట్ రైడ్ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కేరళలో మరో చూడదగ్గ ప్రదేశం మున్నార్‌.. ఇక్కడి ఎత్తైన పచ్చని పర్వతాలు, హత్తుకునే మేఘాల దృశ్యం పర్యాటకుల్ని మంత్రముగ్దులను చేస్తుంది. మున్నార్ టీ ఉత్పత్తికి కూడా ప్రసిద్ధి. తేయాకు తోటల సువాసన, ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అంతేకాదు, కొత్తగా పెళ్లయిన జంటలకు ఇది ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశంగా నిలుస్తోంది. కేరళలోని పూవార్ ద్వీపం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ బస చేసేందుకు ఫ్లోటింగ్ కాటేజీలు ఉన్నాయి. మీరు మోటే హార్బర్‌లో పడవ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. వివిధ రకాల క్రూయిజ్‌లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కేరళలోని తిరువనంతపురం నుండి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోవలం కూడా అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. కోవలం భారీ కొబ్బరి చెట్లు, ఆసక్తికరమైన బీచ్‌లతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కోవలంను దక్షిణ భారత స్వర్గంగా పిలుస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...