Viral Video: అకస్మాత్తుగా సిలిండర్‌కు మంటలు.. ముగ్గురు ఎంత కష్టపడినా నో యూజ్.. సింపుల్ ట్రిక్ తో చెక్

చదువుతో వచ్చిన విజ్ఞానం పరిమితి ఎక్కడ ముగుస్తుందో.. అక్కడ నుంచి అనుభవ ప్రయాణం ప్రారంభమవుతుంది. అందుకనే ఇంట్లోని పెద్దవారు.. జీవితంలో విజ్ఞానం కంటే అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు. అయితే ఇప్పుడు పెద్దలు ఏదైనా చెప్పబోతే అదంతా ట్రాష్ అంటూ కొట్టేస్తూ చిన్న చూపు చూసేవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి.. ఇక్కడ ప్రజలు అన్ని రకాలుగా తమ తెలివి తేటలను విజ్ఞానాన్ని ఉపయోగించారు కానీ సమస్య నుండి బయటపడలేదు.

Viral Video: అకస్మాత్తుగా సిలిండర్‌కు మంటలు.. ముగ్గురు ఎంత కష్టపడినా నో యూజ్.. సింపుల్ ట్రిక్ తో చెక్
Gas Cylinder Fire Video
Follow us
Surya Kala

| Edited By: TV9 Telugu

Updated on: Mar 07, 2024 | 3:19 PM

ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా రకాల ఫన్నీ విషయాలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిని పదే పదే చూస్తూ.. నవ్వుతూనే ఉంటాం. నచ్చి మెచ్చిన వీడియోలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుని సందడి చేస్తారు కూడా.. ఇలాంటి ఫన్నీ వీడియోలు అన్నింటికంటే వేగంగా వైరల్ కావడానికి ఇదే కారణం. అలాంటి వీడియో ఒకటి ఈ మధ్య  నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత జీవితంలో అనుభవం ఎంత ముఖ్యమో..ఉపయోగకరంగా ఉంటుందో ఎవరికైనా అర్థమవుతుంది.

జీవితంలో చదువు , దీనితో వచ్చిన విజ్ఞానం అనేది సర్వస్వం కాదని.. విజ్ఞానంతో పాటు అనుభవం కూడా ఉండాలని తరచుగా ఇంట్లో పెద్దలు పిల్లలకు చెబుతూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే చదువుతో వచ్చిన విజ్ఞానం పరిమితి ఎక్కడ ముగుస్తుందో.. అక్కడ నుంచి అనుభవ ప్రయాణం ప్రారంభమవుతుంది. అందుకనే ఇంట్లోని పెద్దవారు.. జీవితంలో విజ్ఞానం కంటే అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు. అయితే ఇప్పుడు పెద్దలు ఏదైనా చెప్పబోతే అదంతా ట్రాష్ అంటూ కొట్టేస్తూ చిన్న చూపు చూసేవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి.. ఇక్కడ ప్రజలు అన్ని రకాలుగా తమ తెలివి తేటలను విజ్ఞానాన్ని ఉపయోగించారు కానీ సమస్య నుండి బయటపడలేదు.. అయితే అక్కడకు ఓ అనుభవజ్ఞుడైన వ్యక్తి వచ్చాడు.. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఓ వ్యక్తి తన సైకిల్‌పై గ్యాస్ సిలిండర్‌ను తీసుకెళ్లడం వీడియోలో మీరు చూడవచ్చు. అప్పుడు అకస్మాత్తుగా ఆ గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు తనను తాను రక్షించుకోవడానికి.. ఆ వ్యక్తి మొదట సిలిండర్‌కు దూరంగా జరిగాడు. కష్టాల్లో ఉన్న ఆ వ్యక్తిని చూసి నలుగురైదుగురు వ్యక్తులు కూడా వచ్చి అతడిని కాపాడేందుకు  గ్యాస్ సిలెండర్ మీద నీరు పోసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు ఆరిపోలేదు. ఇలా ప్రతి ఒక్కరూ రాకరకాలుగా తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ మంటలు ఆరిపోలేదు. అదే సమయంలో ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. మండుతున్న గ్యాస్ సిలెండర్ ను చూసి.. తన  అనుభవాన్ని ఉపయోగించి వెంటనే మంటలను ఆర్పివేశాడు.

ఈ వీడియో @ScienceGuys_ అనే ఖాతాతో Xలో భాగస్వామ్యం చేయబడింది. ఈ వార్త రాసే వరకు, లక్ష మందికి పైగా ప్రజలు దీనిని చూశారు. రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు ఇలా వ్రాశారు ‘అనుభవం జ్ఞానాన్ని ఎలా అధిగమిస్తుందో చూడండి.’ మరొకరు, ‘అగ్నిని ఆర్పే ఈ ట్రిక్ నిజంగా అద్భుతమైనది సోదరా’ అని రాశారు. అంతేకాదు చాలా మంది ఇతరలు కూడా తమ అభిప్రాయాలను రకరకాల కామెంట్ రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..