AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఐ ఫోన్ క్రేజ్ అంటే అట్లా ఉంటుంది మరి.. బిచ్చగాడు చిల్లరతో ఐఫోన్ కొన్న వీడియో వైరల్

ఐఫోన్ మొబైల్ అంటే పిచ్చి చివరకు బిక్షాటన చేసే వారికీ కూడా ఉంది. ఓ యువకుడు యాచన చేస్తూ దాచుకున్న సొమ్ముని మొత్తం ఉపయోగించి యాపిల్ ఫోన్ కొనుగోలు చేశాడు. ఓ బిక్షాటన చేసే యువకుడు చిల్లర నాణాలతో ఏకంగా యాపిల్ స్టోర్‌కు వెళ్లి మరీ యాపిల్ 15 ప్రో మాక్స్‌ని కొనుగోలు చేశాడు. ఈ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Viral Video: ఐ ఫోన్ క్రేజ్ అంటే అట్లా ఉంటుంది మరి.. బిచ్చగాడు చిల్లరతో ఐఫోన్ కొన్న వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Mar 03, 2024 | 11:21 AM

Share

స్మార్ట్ ఫోన్లు ఎన్ని రకాల కంపెనీలు..  ఎన్ని మోడల్స్ వచ్చినా ఐ ఫోన్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ముఖ్యంగా ఐఫోన్ ఫోన్ ని స్టేటస్ సింబల్ గా భావించే యూత్ కూడా ఉన్నారు. అయితే ఈ ఐఫోన్ సామాన్యులకు అందని కలే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ తో ఎవరూ అనుకరించలేని పీచర్లను కలిగి ఉంటుంది. కనుక ఈ ఫోన్ మోడల్ ను బట్టి ధర అని చెప్పవచ్చు. సామాన్యులు ఈ ఫోన్ కొనాలనే కలలో కూడా అనుకోరు. ఎందుకంటే ఈ ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ ఎప్పుడూ అత్యంత ఖరీదైనవిగానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఫోన్లకు లోన్లు, ఈ ఎంఐ సదుపాయం కల్పించిన తర్వాత తమ మనసుకు నచ్చినవి, మెచ్చిన ఫోన్ల ను కొనుగోలు చేయడానికి సామాన్యుడు సైతం ముందుకు అడుగు వేస్తున్నాడు. అందుకనే ఐఫోన్ అంటే పిచ్చి ఉన్న వారు లోన్ తీసుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు.

అయితే ఐఫోన్ మొబైల్ అంటే పిచ్చి చివరకు బిక్షాటన చేసే వారికీ కూడా ఉంది. ఓ యువకుడు యాచన చేస్తూ దాచుకున్న సొమ్ముని మొత్తం ఉపయోగించి యాపిల్ ఫోన్ కొనుగోలు చేశాడు. ఓ బిక్షాటన చేసే యువకుడు చిల్లర నాణాలతో ఏకంగా యాపిల్ స్టోర్‌కు వెళ్లి మరీ యాపిల్ 15 ప్రో మాక్స్‌ని కొనుగోలు చేశాడు. ఈ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

చిల్లర డబ్బులతో యాపిల్ ఫోన్

వైరల్ అవుతున్న వీడియోలో మురికిగా ఉన్న ఓ యువకుడు చిరిగిన దుస్తులను ధరించి ఉన్నాడు. చూసిన వెంటనే బిచ్చగాడు ఏమో అనిపించేలా ఉన్న ఈ యువకుడు రోడ్డు పక్కన రద్దీగా ఉన్న ఓ యాపిల్ స్టార్ లోపలి వెళ్ళాడు. అయితే ఆ యువకుడి లుక్ ని చూసి ఎందుకు తమ షాప్ లోకి వచ్చాడా అని ఆలోచిస్తున్నారు. షాప్ లో ఉన్న ఇతర కస్టమర్స్ కూడా ఆ యువకుడు అవతారాన్ని చూసి అసహ్యించుకున్నారు.

అయితే ఎవరిని లెక్కచేయని ఆ యువకుడు తనకు కావాల్సిన ఐఫోన్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు. ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ను ఖరీదు చేయడానికి వచ్చినట్లు షాక్ లోని సిబ్బందికి చెప్పాడు. దీంతో అక్కడ ఉన్నవారు అంతా షాక్ తిన్నారు. ఎవరు ఎలా ఉంటె నాకు ఏమిటి అన్నట్లుగా ఆ యువకుడు తన దగ్గర ఉన్న ఒక గోనె సంచిని బల్లపై గుమ్మరించాడు. దాని నుంచి చిల్లర ధారగా పడింది. ఈ డబ్బులను తీసుకుని తనకు  యాపిల్ 15 ప్రో మాక్స్ ను ఇవ్వమని అడిగాడు. దీంతో స్టార్ లో పని చేస్తున్న సిబ్బంది అంతా ఆ చిల్లరను లెక్కించి రూ. 1,59,000 లనుతీసుకుని అతనికి ఐఫోన్ 15 ప్రో మాక్స్ ను ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..