Tirumala: శ్రీ‌వారి భ‌క్తుల కోసం టీటీడీ వేసవి ఏర్పాట్లు.. వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాకు కోత

ఏప్రిల్‌ నుండి జూలై వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లు తగ్గించామన్నారు. తిరుమలలో దాదాపు 7500 గదులు ఉన్నాయని, 45 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉందన్నారు. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నామన్నారు. వేసవిలో తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైనంత వసతి సౌకర్యం లేనందున భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా కోరారు

Tirumala: శ్రీ‌వారి భ‌క్తుల కోసం టీటీడీ వేసవి ఏర్పాట్లు.. వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాకు కోత
Tirumala Tirupati
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Mar 03, 2024 | 9:33 AM

తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఎవి.ధర్మారెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామ‌న్నారు. రథసప్తమి సక్సెస్ చేశామన్న ఈవో ధర్మారెడ్డి ఏప్రిల్‌ నుండి జూలై వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లు తగ్గించామన్నారు.

తిరుమలలో దాదాపు 7500 గదులు ఉన్నాయని, 45 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉందన్నారు. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నామన్నారు. వేసవిలో తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైనంత వసతి సౌకర్యం లేనందున భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా కోరారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ కలిస్తున్నామన్నారు.

మార్చి 20 నుండి 24 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయన్నారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు ఈఓ ధర్మారెడ్డి. మార్చి 8న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం నిర్వహిస్తామన్నారు. మార్చి 25న తుంబూరూ తీర్థ ముక్కోటి ఉంటుందన్నారు. ఫిబ్రవరి నెలలో 19.06 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, రూ.111.71 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందన్నారు. 95.43 లక్షల శ్రీవారి లడ్డూల విక్రయించామని 43.61 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. కల్యాణకట్టలో 6.56 లక్షల మంది భక్తులు శ్రీవారికి మొక్కులో భాగంగా తలనీలాలు సమర్పించారని చెప్పారు ధర్మా రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..