Srisailam: వైభవంగా సాగుతున్న మల్లన్న బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం హంసవాహనంపై ఆదిదంపతులు.. పెరిగిన భక్తుల రద్దీ
ఈ రోజు సాయంత్రం హంసవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్నారు ఆదిదంపతులు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీ స్వామి అమ్మవారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆర్జిత సేవలతో పాటు సాధారణ భక్తులకు స్పర్శ దర్శనని రద్దు చేశారు ఆలయ అధికారులు. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనాన్ని కల్పిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ శైలంలో శివ పార్వతులు .. మల్లికార్జునుడు, బ్రమరంభగా భక్తులతో పూజలను అందుకుంటున్నారు. నల్లమల అడవుల్లో శ్రీ గిరిపై కొలువైన ఆదిదంపతుల దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు మూడో రోజుకి ఈ ఉత్సవాలు చేరుకున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలను విజయవాడ కనకదుర్గమ్మ పంపనుంది. పట్టువస్త్రాలను అమ్మవారి తరపున ఆలయ ఈవో రామారావు సమర్పించనున్నారు.
సాయంత్రం గ్రామోత్సవం
ఈ రోజు సాయంత్రం హంసవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్నారు ఆదిదంపతులు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీ స్వామి అమ్మవారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు.
పెరిగిన భక్తుల రద్దీ
బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆర్జిత సేవలతో పాటు సాధారణ భక్తులకు స్పర్శ దర్శనని రద్దు చేశారు ఆలయ అధికారులు. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనాన్ని కల్పిస్తున్నారు. అయితే ఇరుముడి కలిగిన భక్తులకు కూడా ఈ నెల 5 వ తేదీ వరకు మాత్రమే మల్లన్న స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిని ఇవ్వనున్నారు. 6 వ తేదీ నుంచి సామాన్యుల భక్తుల వలెనే శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
మరోవైపు సాధారణ భక్తులందరికి శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నారు ఆలయ అధికారులు. తెల్లవారుజాము నుంచే శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో క్యూ లైన్ లో రద్దీ పెరిగింది. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..