AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Planet Transit: రేపటి నుంచి రాశులను మార్చుకోనున్న పలు గ్రహాలు.. ఈ నెలలో ధనవంతులు కాబోతున్న 5 రాశులు .. అందులో మీరున్నారా..

కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితంలో అనుకోని మార్పులు జరగనున్నాయి. రేపు (మార్చి 4న) కేతువు తన రాశిని మార్చుకోనుండగా మార్చి 7వ తేదీన బుధుడు, మార్చి 14వ తేదీన సూర్యుడు, మార్చి 25వ తేదీన కుజుడు ( అంగారకుడు) తమ తమ రాశులను మార్చుకుని మరొక రాశుల్లోకి అడుగు పెట్టనున్నారు. అయితే శనిశ్వరుడు మాత్రం ప్రస్తుతం ఉన్న కుంభరాశిలోనే సంచరించనున్నాడు. ఈ గ్రహాల మార్పులు కొన్ని రాశులవారికి అనుకూలంగా అంటే.. అదృష్టాన్ని తీసుకుని రానుంది. ఈ నెల అంతా ఐదు రాశుల వారికి సుఖ సంతోషాలను ఇవ్వనుంది. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Planet Transit: రేపటి నుంచి రాశులను మార్చుకోనున్న పలు గ్రహాలు.. ఈ నెలలో ధనవంతులు కాబోతున్న 5 రాశులు .. అందులో మీరున్నారా..
Monthly Horoscope For March 2024
Surya Kala
|

Updated on: Mar 03, 2024 | 7:05 AM

Share

ప్రతి వ్యక్తి జాతకంలోనూ గ్రహాల స్థానం ప్రాముఖ్యత వహిస్తాయి. ఈ గ్రహాల కదలిక, సంచారం, ఒక రాశిలో నిర్దిష్ట సమయంలో ఉదయించడం లేదా అస్తమించడం వంటి పరిణామాలు శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఈ నెలలో కూడా కొన్ని గ్రహాలు తమ రాశులను మర్చుకోనున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితంలో అనుకోని మార్పులు జరగనున్నాయి. రేపు (మార్చి 4న) కేతువు తన రాశిని మార్చుకోనుండగా మార్చి 7వ తేదీన బుధుడు, మార్చి 14వ తేదీన సూర్యుడు, మార్చి 25వ తేదీన కుజుడు ( అంగారకుడు) తమ తమ రాశులను మార్చుకుని మరొక రాశుల్లోకి అడుగు పెట్టనున్నారు. అయితే శనిశ్వరుడు మాత్రం ప్రస్తుతం ఉన్న కుంభరాశిలోనే సంచరించనున్నాడు. ఈ గ్రహాల మార్పులు కొన్ని రాశులవారికి అనుకూలంగా అంటే.. అదృష్టాన్ని తీసుకుని రానుంది. ఈ నెల అంతా ఐదు రాశుల వారికి సుఖ సంతోషాలను ఇవ్వనుంది. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

కన్య రాశి: రేపటి నుంచి జరగనున్న గ్రహాల సంచారం ఈ రాశికి చెందిన వ్యక్తులకు అన్ని విధాలా శుభ ఫలితాలను ఇవ్వనుంది. అంతేకాదు సమాజంలో కీర్తి, ప్రతిష్టలను అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి మరింతగా బలపడి.. కొత్త వస్తువులు, వాహనాల కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేసి సంపాదన మరింతగా పెంచుకుంటారు. ఈ రాశికి చెందిన వ్యక్తుల వ్యక్త్వితం నలుగురిని ఆకట్టుకుని సరదాగా సాగిపోతారు. లగ్జరీ లైఫ్ ను గడుపుతారు.

వృశ్చిక రాశి: మార్చి నెలలో అనేక గ్రహాల గమనంలో మార్పులు ఈ రాశికి చెందిన వ్యక్తులకు రాజయోగాన్ని తెస్తున్నట్లే లెక్క.. ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లోని వారి ఆర్ధిక పరిస్థితి బలపడి. ఆదాయం అద్భుతంగా ఉండనుంది. చేసిన పనిలో మంచి గుర్తింపు లభిస్తుంది. పదిమందితో ప్రశంసలను అందుకుంటారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి: రేపటి నుంచి జరగనున్న గ్రహాల గమనంలో మార్పు కారణంగాఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలించి శుభవార్త వింటారు. అన్ని విధాలా ఆర్థికంగా లాభపడతారు. నగలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంతేకాదు వివాహ ప్రయత్నం చేస్తున్న యువతీ యువకుల ప్రయత్నాలు ఫలించి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: రేపటి నుంచి జరగనున్న గ్రహాల మార్పులు ఈ రాశి వారికి అన్ని విధాలా శుభాలను తెస్తుంది. ప్రేమలో ఉన్నవారి ప్రేమ ఫలిస్తుంది. విదేశాలకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్ధులకు అనుకూల సమయం. పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు ఈ నెల రోజులు.. అంతేకాదు పెళ్లి కోసం ప్రయత్నలుచేస్తే.. ఈ నెలలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

సింహ రాశి: ఈ నెలలో గ్రహాల సంచారం సింహరాశి వారికి ఊహించని లాభాలను అందిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ అందుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. విదేశీ యానం చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ నెల ఈ రాశి వారికీ అదృష్టాన్ని సమాజంలో కీర్తి ప్రతిష్టలు తెస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు