Horoscope Today: వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు రావొచ్చు జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు
దిన ఫలాలు (మార్చి 4, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెంచుతారు. వ్యాపారాలలో చురుకుదనం పెరుగుతుంది. మిథున రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మార్చి 4, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెంచుతారు. వ్యాపారాలలో చురుకుదనం పెరుగుతుంది. మిథున రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి తీరిక ఉండకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో సర దాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మీ మనుసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సన్ని హితులతో వాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో మంచి పరిచయాలేర్పడతాయి. ఆరోగ్యం పరవా లేదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెంచుతారు. వ్యాపారాలలో చురుకుదనం పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కొన్నికొత్త ప్రయత్నాలు చేపడతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాలలో, ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాన్ని పరిష్క రించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాలలో ఉన్న కొన్ని ప్రధానమైన అడ్డంకులను తొలగించు కుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి కొత్త అవకాశాలు అందివస్తాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉత్సాహంగా బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి బాగా వస్తాయి. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వారితో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవ సరం ఉంది. సేవ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయట పడతారు. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రు లుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సంపాదన పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేప డతారు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఆస్తి సంబంధమైన విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. సామరస్య వాతావరణం నెలకొంటుంది. వ్యాపా రాల పరిస్థితి నిలకడగానే ఉంటుంది. కొన్ని కుటుంబ సంబంధమైన ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తి అవుతాయి. ఆస్తి సంబంధమైన వివా దాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయానికి సంబంధించి కొందరు మిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య, ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభి స్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)
వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా, ఉత్సా హంగా సాగిపోతాయి. సర్వత్రా మాటకు విలువ పెరుగుతుంది. శుభ కార్యాలకు ఆహ్వానాలు అందు తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్న ప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
సంపాదనకు లోటుండదు కానీ, మిత్రుల మీద ఎక్కువగా వృథా ఖర్చు చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అప్రయత్న ధనలాభం ఉంటుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాలలో మార్పులు, చేర్పులు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. వృత్తి నిపుణులకు గుర్తిం పుతో పాటు డిమాండ్ పెరుగుతుంది. దగ్గర బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా సత్ఫలితాలనిస్తాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అలవికాని లక్ష్యాలను అప్పగించే సూచనలు న్నాయి. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావ రణం కనిపిస్తోంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.