Budha Gochar: మీన రాశిలో నీచస్థితిలో బుధుడు.. వారు జాగ్రత్తలు పాటించకపోతే కష్టనష్టాలే! పరిహారాలు ఇవీ..
ఈ నెల 8వ తేదీ నుంచి బుధుడు మీన రాశిలో నీచబడడం జరుగుతోంది. పైగా అక్కడ వక్ర గ్రహమైన రాహువుతో కలవడం కూడా జరుగుతోంది. బుధుడు ఈ నెల 27 వరకూ నీచస్థితిలోనే కొనసాగుతున్నందువల్ల కొన్ని రాశులకు యోగప్రదమైన జీవితాన్నిచ్చే అవకాశమున్నప్పటికీ, ఆరు రాశుల వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం, కొన్ని పరిహారాలు చేయడం వల్ల నీచ బుధుడి నుంచి రక్షణ లభిస్తుంది.
ఈ నెల 8వ తేదీ నుంచి బుధుడు మీన రాశిలో నీచబడడం జరుగుతోంది. పైగా అక్కడ వక్ర గ్రహమైన రాహువుతో కలవడం కూడా జరుగుతోంది. బుధుడు ఈ నెల 27 వరకూ నీచస్థితిలోనే కొనసాగుతున్నందువల్ల కొన్ని రాశులకు యోగప్రదమైన జీవితాన్నిచ్చే అవకాశమున్నప్పటికీ, ఆరు రాశుల వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం, కొన్ని పరిహారాలు చేయడం వల్ల నీచ బుధుడి నుంచి రక్షణ లభిస్తుంది. ఆ రాశులుః మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులు. బుద్ధి కారకుడైన బుధుడు నీచబడినందువల్ల ఈ రాశులవారు తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. తెలివితక్కువ పనులతో, అవివేకపు నిర్ణయాలతో సమస్యలను కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఒప్పందాలు, నిర్ణయాలు, కార్యాచరణ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
- మేషం: ఈ రాశివారికి బుధుడు వ్యయ స్థానంలో ప్రవేశించడం, అందులోనూ రాహువుతో కలిసి ఉండడం వల్ల ఆస్తి సంబంధమైన ఒప్పందాల మీద సంతకం చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బాగా సన్నిహితులు మోసం చేయడం లేదా ఇరకాటంలో పెట్టడం జరుగుతుంది. ఈ రాశివారు కొద్ది రోజుల పాటు ఇతరులకు హామీ ఉండడం లేదా వాగ్దానాలు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల విషయంలో కూడా మోసపోయే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశివారికి బుధుడు అష్టమ స్థానంలో నీచబడినందువల్ల, ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొందరు బంధువుల కారణంగా డబ్బు నష్టం జరిగే సూచనలున్నాయి. మీకు వాగ్దానం చేసిన వారు వాగ్దాన భంగం చేసే అవకాశం ఉంది. వివాదాల్లో తలదూర్చి ఇబ్బంది పడడం జరుగుతుంది. మీ మాటలను, చేతలను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం మంచిది కాదు.
- తుల: ఈ రాశివారికి ఆరవ స్థానంలో బుధుడి ప్రవేశం వల్ల వృత్తి, వ్యాపారాలపరంగా తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది. పొరపాటు నిర్ణయాలతో చిక్కుల్లో పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎటు వంటి ఒప్పందాల మీదా సంతకాలు చేయకపోవడం మంచిది. ఆస్తి ఒప్పందాల్లో మరీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త వారిని తేలికగా లేదా గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. బంధుమిత్రుల్లో కొందరు తప్పుదోవ పట్టించడం జరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
- ధనుస్సు: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో బుధుడు నీచబడుతున్నందువల్ల, గృహ, వాహన సౌకర్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి సంబంధించిన అగ్రిమెంట్ల విషయంలో మోసపోయే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం వల్ల సమస్యలకు గురి కావాల్సి వస్తుంది. అనవసర పరిచయాలకు, అక్రమ సంబంధాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. అపనిందలకు గురయ్యే సూచనలు కూడా ఉన్నాయి.
- మకరం: ఈ రాశివారికి మూడవ స్థానంలో బుధ సంచారం వల్ల మిమ్మల్ని అతిగా ఉపయోగించుకునే వారు, స్వార్థానికి ఉపయోగించుకునేవారు చుట్టూ చేరతారు. ఇతరుల పనులకు మీరు బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బంది పడతారు. ఎవరికైనా డబ్బు సహాయం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. హామీలు ఉండడం వల్ల డబ్బు నష్టపోతారు. కొత్త నిర్ణయాలకు, ప్రయత్నాలకు సమయం ఏమాత్రం అనుకూలంగా లేదు.
ముఖ్యమైన పరిహారాలు: నీచత్వం పట్టిన బుధుడి దుష్ప్రభావం నుంచి బయటపడాలన్న పక్షంలో తప్పనిసరిగా ప్రతి రోజూ ఉదయమే వినాయకుడిని మనసులోనే ప్రార్థించుకోవడం మంచిది. స్కంధ స్తోత్రం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. వినాయకుడి ఆలయంలో గానీ, శివాలయంలో గానీ బుధవారం ఉదయం కొద్దిమందికి ప్రసాద వితరణ చేయడం వల్ల కూడా బుధుడి దుష్ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..