Shukra Gochar: కుంభ రాశిలో శనితో శుక్రుడు కలయిక.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, భోగభాగ్యాలు..!
Telugu Astrology 2024: ఈ నెల 8న కుంభ రాశిలో ప్రవేశించబోతున్న శుక్రుడు అక్కడ తన ప్రాణమిత్రుడైన శనితో కలవడం జరుగుతోంది. ఫలితంగా శుక్రుడు కొన్ని రాశుల వారికి శుభ యోగాలను కలగజేస్తాడు. ఈ నెల 31 వరకూ శుక్రుడు తనకు ఇష్టమైన రాశుల వారికి భోగభాగ్యాలు కలగజేస్తాడు. సిరి సంపదలు అనుగ్రహిస్తాడు.
ఈ నెల 8న కుంభ రాశిలో ప్రవేశించబోతున్న శుక్రుడు అక్కడ తన ప్రాణమిత్రుడైన శనితో కలవడం జరుగుతోంది. ఫలితంగా శుక్రుడు కొన్ని రాశుల వారికి శుభ యోగాలను కలగజేస్తాడు. ఈ నెల 31 వరకూ శుక్రుడు తనకు ఇష్టమైన రాశుల వారికి భోగభాగ్యాలు కలగజేస్తాడు. సిరి సంపదలు అనుగ్రహిస్తాడు. ఆ రాశులుః మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభం. ప్రస్తుతం కుంభ రాశిలో ప్రవేశించబోతున్న శుక్రుడు తాను ఈ రాశిని వదిలేలోగా తప్పకుండా ఈ రాశులవారికి వీలైనంతగా అదృష్టాన్ని కలిగించడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి లాభ స్థానంలో ప్రవేశించబోతున్న శుక్రుడు ఈ రాశివారికి తప్పకుండా సంపద పెంచు తాడు. ఏదో విధంగా లాభం కలిగిస్తాడు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అన్నదమ్ముల పురోభివృద్ధికి చేయూత నందిస్తారు. విదేశీయానానికి అవకాశాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
- వృషభం: ఈ రాశికి తాను అధిపతి అయినందువల్ల శుక్రుడు ఈ రాశివారికి సిరిసంపదలను అనుగ్రహించ కుండా ఉండడు. భోగభాగ్యాలతో పాటు విలాస జీవితాన్ని అందిస్తాడు. ఆరోగ్యాన్ని బాగా మెరుగు పరచడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పది మందికీ ఉపయోగపడే పనులు చేయడం జరుగుతుంది. ఈ రాశివారికి శుక్రుడు దశమ స్థానంలోకి రాబోతున్నందువల్ల అటు నిరుద్యోగులకు, ఇటు ఉద్యోగులకు బాగా డిమాండు పెరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు సంచారం ప్రారంభించడం ఈ రాశివారికి తప్పకుండా అదృ ష్టాన్ని కలగజేస్తుంది. ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన యోగానికి అవకాశం ఉంది. విదేశీ మూలక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లేదా సంపద కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, వడ్డీ వ్యాపారాలు వంటివి అంచనాలకు మించిన లాభాలని స్తాయి. తోబుట్టువులకు బాగా సహాయం చేయడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో శనీశ్వరుడితో కలవడం వల్ల ఈ రాశివారి కోరికలన్నీ తీర్చే అవకాశం ఉంది. అంచనాలకు మించి ఆదాయం లేదా రాబడి పెరుగుతుంది. అనేక ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడంతో పాటు ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో ప్రవేశిస్తున్న శుక్రుడు తప్పకుండా సిరిసంపదలను అనుగ్రహిస్తాడు. ఈ రాశి తన ప్రాణ స్నేహితుడైన శని రాశి అయినందువల్ల ఈ రాశివారికి వీలైనంతగా ఉపకారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ధనాన్ని పెంచుతాడు. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు ప్రసాదిస్తాడు. జీవిత భాగస్వామిని కూడా అన్ని విధాలు గానూ అందలాలు ఎక్కిస్తాడు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చేలా చేస్తాడు.
- కుంభం: ఈ రాశిలో ఉన్న రాశ్యధిపతి శనీశ్వరుడితో శుక్రుడు కలవడం వల్ల ఈ రాశివారికి మంచి రాజ యోగం ఏర్పడింది. ఏ పని చేసినా, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఏం చేసినా చెలామణీ అయిపోతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగు తుంది. ఈ శుక్రుడి వల్ల ఏలిన్నాటి శని ప్రభావం గరిష్ఠంగా తగ్గిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతులు లభిస్తాయి.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..