Horoscope Today: ఆ రాశుల వారి ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 5, 2024): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. సరికొత్త లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. వృషభ రాశి వారు వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. లాభాలు తగ్గే సూచనలున్నాయి. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశుల వారి ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
Horoscope Today 05th March 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 05, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మార్చి 5, 2024): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. సరికొత్త లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. వృషభ రాశి వారు వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. లాభాలు తగ్గే సూచనలున్నాయి. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. సరికొత్త లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. ఆర్థిక లావా దేవీల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం ఇబ్బందులకు గురి చేస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఊహించని శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. లాభాలు తగ్గే సూచనలున్నాయి. వృత్తి జీవి తానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. రాజకీయంగా కార్యకలాపాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితు లతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. కొందరు మిత్రుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలందిస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగు తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఫలితం ఉంటుంది. అనుకోకుండా మొండి బాకీలు వసూలు అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్ర త్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. జీవిత భాగ స్వామికి అనుకోని అదృష్టం పడుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశా జనకంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన స్థాయిలో విజయం లభించే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సొంత పనులు, వ్యవహారాలను జాగ్రత్తగా చక్కబెట్టుకోవడం మంచిది. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగి పోతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. వ్యక్తిగత సమ స్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో డాక్టర్లను సంప్రదించాల్సి వస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి ఉంటుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. సహోద్యోగుల నుంచి ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాల్లో కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వీటిని సద్విని యోగం చేసుకోవలిసి ఉంటుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, వైద్యం, మద్యం తదితర రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రుల నుంచి ఆశించిన సహాయమందుతుంది. తలపె ట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపో తుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇరకాట పరిస్థితి ఏర్పడుతుంది. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన పనులు చాలావరకు పూర్తవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగులకు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఆదాయ పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు ఫలి స్తాయి. కొందరు మిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలలో లాభాలు కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ వృథా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. బంధువుల నుంచి ఒకటి రెండు సమస్యలు ఎదురవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలలో సంపాదనకు లోటు ఉండదు. ఉద్యోగ జీవితంలో సానుకూలత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించ డానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. తోబుట్టువులతో కొద్దిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.