Shukra Gochar: కుంభ రాశిలో రవితో శుక్రుడు యుతి.. ఆ రాశుల వారికి ఆదాయ, అధికార యోగాలు!
ఈ నెల 8న కుంభ రాశిలో ప్రవేశిస్తున్న శుక్రుడు అక్కడ ఉన్న రవితో యుతి చెందడం జరుగుతుంది. ఇందులో రవి అధికారానికి సంబంధించిన గ్రహం కాగా, శుక్రుడు సంపదకు, సుఖాలకు కారకుడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అయిదు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తుండగా, ఏడు రాశుల వారికి భారీ ఆదాయంతో కూడిన అధికార యోగం పట్టే అవకాశం ఉంది.
ఈ నెల 8న కుంభ రాశిలో ప్రవేశిస్తున్న శుక్రుడు అక్కడ ఉన్న రవితో యుతి చెందడం జరుగుతుంది. ఇందులో రవి అధికారానికి సంబంధించిన గ్రహం కాగా, శుక్రుడు సంపదకు, సుఖాలకు కారకుడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అయిదు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తుండగా, ఏడు రాశుల వారికి భారీ ఆదాయంతో కూడిన అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఇటువంటి రాజయోగం పట్టే రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర, కుంభ రాశులు. ఈ నెల 31 వరకూ శుక్రుడు కుంభ రాశిలోనే కొనసాగుతున్నందువల్ల ఈ ఫలితాలు, ఈ యోగాలు ఈ నెలాఖరు వరకు వర్తించే అవకాశముంది.
- మేషం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర, రవులు కలుస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో హోదాతో పాటు ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి మరింతగా రాజయోగం పడుతుంది. ఏ రంగానికి చెందిన వారికైనా అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. విలాస జీవితంలో మునిగి తేలుతారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలఉ వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడితో రవి చేరుతున్నందువల్ల తప్పకుండా అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన ఆర్జనకు అవకాశం ఉంది. ప్రాభవం, ప్రాధాన్యం పెర గడంతో పాటు ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. ఆకస్మిక, అప్రయత్న ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలన్నీ చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం ఆశించిన స్థాయిలో కుదుటపడుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
- సింహం: ఈ రాశినాథుడైన రవితో సప్తమ స్థానంలో శుక్రుడు కలవడం వల్ల రాజకీయ నాయకులకు తిరుగులేని అధికార యోగం పట్టే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా మహా భాగ్య యోగాన్ని, అధికార యోగాన్ని ఏకకాలంలో అనుభవించడం జరుగుతుంది. కెరీర్ పరంగానే కాకుండా సామాజికంగా కూడా ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఈ రాశివారి సలహాలు, సూచ నలకు విలువ ఉంటుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.
- తుల: ఈ రాశినాథుడైన శుక్రుడు రాజయోగ కారక గ్రహమైన రవితో యుతి చెందడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిసి మెలిసి తిరిగే అవ కాశం కలుగుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయంతో పాటు అదనపు రాబడి కూడా విశేషంగా పెరుగు తుంది. ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు ఇది అనేక విధాలుగా అనుకూలమైన సమయం.
- ధనుస్సు: ఈ రాశివారికి మూడవ స్థానంలో రవి, శుక్రుల సంచారం జరుగుతున్నందువల్ల, అనేక విధాలుగా సమయం అనుకూలంగా ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అందలాలు ఎక్కడంతో పాటు ఆదాయ వృద్ధికి కూడా అవకాశం ఉంది. అప్రయత్న ధన లాభానికి కూడా అవ కాశం ఉంది. ఆస్తిపాస్తులు, సంపద కలిసి వస్తాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి.
- మకరం: ఈ రాశికి ధన స్థానంలో రవి, శుక్రులు కలుస్తుండడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టడానికి, దాంతో పాటు ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా అనేక లాభాలు అందివస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారేవారికి కూడా అదృష్టం పడుతుంది.
- కుంభం: ఈ రాశిలో శుక్ర, రవుల కలయిక జరగడం ఒక మంచి రాజయోగం. ఎక్కడ ఉన్నా, ఏ రంగానికి చెందినా ఈ రాశివారికి అధికార యోగంతో పాటు, ధన యోగం కూడా పడుతుంది. ఈ నెలాఖరు వరకు వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారికి డిమాండు బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.