Zodiac Signs: రవి, రాహువులతో చంద్రుడు కలయిక.. ఆ రాశుల వారికి కష్టనష్టాలు రావొచ్చు జాగ్రత్త..!
నాలుగు రోజుల పాటు ఆరు రాశుల వారు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశులకు అత్యంత శుభ గ్రహమైన చంద్రుడు 9, 10 తేదీల్లో రవితో కలవడం, అంటే అమావాస్య ఏర్పడడం, ఆ తర్వాత 11, 12 తేదీల్లో రాహువుతో కలవడం ఈ రాశులను రకరకాలుగా ఇబ్బందుల పాలు చేసే అవకాశం ఉంది.
నాలుగు రోజుల పాటు ఆరు రాశుల వారు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశులకు అత్యంత శుభ గ్రహమైన చంద్రుడు 9, 10 తేదీల్లో రవితో కలవడం, అంటే అమావాస్య ఏర్పడడం, ఆ తర్వాత 11, 12 తేదీల్లో రాహువుతో కలవడం ఈ రాశులను రకరకాలుగా ఇబ్బందుల పాలు చేసే అవకాశం ఉంది. చంద్రుడు ఛాయాగ్రహమైన రాహువుతో కలవడం అంటే దాదాపు గ్రహణంలో ఉన్నట్టే అవుతుంది. మొత్తం మీద ఈ నాలుగు రోజుల్లో చంద్రుడు బాగా బలహీనపడడం వల్ల ఎక్కువగా దుష్ఫలితాలనివ్వడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశివారికి సుఖ స్థానాధిపతి (నాలుగవ స్థానం) అయిన చంద్రుడు లాభస్థానంలో రవిని కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా అవమానాల పాలు కావడం, వ్యాపారాల్లో లాభాలు స్తంభిం చిపోవడం వంటివి జరుగుతాయి. ఎవరి వలలోనో పడి బాగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఆ తర్వాత వ్యయ స్థానంలో రాహువుతో కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఎవరి కుట్రలతోనో కొద్దిగా ఇబ్బంది పడడం జరుగుతుంది. నాలుగు రోజుల పాటు ఎవరినీ నమ్మకపోవడం మంచిది.
- మిథునం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన చంద్రుడు దశమ, లాభ స్థానాల్లో బలహీనపడడం జరుగు తోంది. ఒక నాలుగు రోజుల పాటు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఆర్థికంగా నష్టపోవడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా తగ్గడం, ఆర్థికంగా ఒత్తిడి పెరగడం వంటివి జరుగుతాయి. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందకపోవచ్చు. సహాయం పొందినవారు ముఖం చాటేయవచ్చు. కుటుంబ సమస్యలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి.
- కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడు అష్టమ, భాగ్య స్థానాల్లో బలహీనపడడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో దెబ్బతినడం జరగవచ్చు. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆస్తి సమస్యలు పెరుగుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు లేదా పత్రాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అవమానాల పాలయ్యే అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
- కన్య: ఈ రాశికి లాభాధిపతి అయిన చంద్రుడు ఆరు, ఏడు స్థానాల్లో బలహీనపడడం వల్ల, కష్టార్జితంలో అత్యధిక భాగం వృథా అవడం జరుగుతుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వడం గానీ, డబ్బు తీసుకో వడం గానీ చేయకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు బాగా ఇబ్బంది పెడతాయి. మంచి స్నేహా లకు దూరం అవుతారు. మిత్రుల వల్ల డబ్బు బాగా ఖర్చవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని పొర పాట్లు చేసే అవకాశం కూడా ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చివరి దాకా వచ్చి ఆగిపోతాయి.
- వృశ్చికం: ఈ రాశికి భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన చంద్రుడు అమావాస్య కారణంగానూ, రాహువుతో కలవడం వల్లనూ బలహీనపడినందువల్ల, ఎక్కువగా దుర్వార్తలు వినడం జరుగుతుంది. బంధు వుల ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనకర వార్తలు వింటారు. ప్రయాణాల వల్ల బాగా నష్టపో తారు. మిత్రుల వల్ల మోసపోతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. స్పెక్యులేషన్ కొద్దిగా కూడా లాభించదు. తల్లితండ్రులతో అకారణంగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
- మీనం: ఈ రాశికి పంచమాధిపతిగా అత్యంత శుభుడైన చంద్రుడు బలహీనపడడం వల్ల నాలుగు రోజుల పాటు వీరు ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతోనే కాకుండా, కుటుంబ సభ్యులతో కూడా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పిల్లల వల్ల సమస్యలు తలెత్తుతాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లోనూ, ఒప్పందాలపై సంతకాలు చేయడంలోనూ అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆరోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు.