Kurnool: ఆ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ వార్.. తలలు పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ టికెట్ వార్ రోజురోజుకు పిక్ స్టేజ్ కు చేరుతుంది. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గం ఇంచార్జి గా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో సుప్పర్ సిక్స్, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంల ద్వారా నిత్యం ప్రజల మధ్య గడుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మొదటి జాబితాలో అయన పేరు రాకపోవడం ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయంగా మారింది.

Kurnool: ఆ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ వార్.. తలలు పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
TDP
Follow us
J Y Nagi Reddy

| Edited By: Balu Jajala

Updated on: Mar 03, 2024 | 7:37 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ టికెట్ వార్ రోజురోజుకు పిక్ స్టేజ్ కు చేరుతుంది. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గం ఇంచార్జి గా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో సుప్పర్ సిక్స్, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంల ద్వారా నిత్యం ప్రజల మధ్య గడుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మొదటి జాబితాలో అయన పేరు రాకపోవడం ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయంగా మారింది. మరో పక్క వైసీపీ అధిష్టానం బీసీలకు పెద్ద పిటా వేస్తూ ఎమ్మిగనూరు కు బీసీ అభ్యర్థి బుట్టరేణుక ను నియమించడంతో టీడీపీ కూడా బీసీ అభ్యర్థిని పెట్టాలని ఆలోచిస్తునట్టు సమాచారం.

అదే తరుణంలో ఎమ్మిగనూరులో టీడీపీ టికెట్ బీసీ లకు ఇవ్వాలని పద్మశ్రీ మాచని సోమప్ప ముని మనుమడు  మాచని సోమనాథ్ టీడీపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో ఎమ్మిగనూరులో రోజుకో కార్యక్రమం చేస్తూ నేతల ఆత్మీయ సమావేశం అంటూ పెద్ద ఎత్తున పట్టణ ప్రధాన కూడలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే రెండు రోజుల క్రితం ఎమ్మిగనూరులో ఏర్పటు చేసిన టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బి.టి. నాయుడు మాట్లాడుతూ కొంతమంది జిల్లా, రాష్ట్ర,నాయకుల అనుమతి లేకుండా ప్రచారాలు చేస్తున్నారని సోమనాథ్ ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. వారిపై క్రమశిక్షణ చర్యలు చేపడతామని బహిరంగంగా చెప్పిన వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సోమనాథ్ ర్యాలీలు సమావేశాలు ఏర్పాటు చేయడంతో టీడీపీ టికెట్ ఎవరికీ వస్తుందో అర్థంకాక అందరూ తలలు పట్టుకుంటున్నారు.