తొలిజాబితాపై కొనసాగుతున్న అసమ్మతి.. దళిత గర్జన సభలో టీడీపీ నేత ఆవేదన..

తొలిజాబితాపై కొనసాగుతున్న అసమ్మతి.. దళిత గర్జన సభలో టీడీపీ నేత ఆవేదన..

J Y Nagi Reddy

| Edited By: Srikar T

Updated on: Mar 03, 2024 | 7:37 PM

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న తమకు మొదటి జాబితాలో పేరు లేకపోవడం బాధగా ఉందని ఆదోని మాజీ ఎమ్మెల్యే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మీనాక్షి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో నిర్వహించిన దళిత గర్జన మహాసభలో ఆయన హాజరయ్యారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న తమకు మొదటి జాబితాలో పేరు లేకపోవడం బాధగా ఉందని ఆదోని మాజీ ఎమ్మెల్యే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మీనాక్షి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో నిర్వహించిన దళిత గర్జన మహాసభలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, మీనాక్షి నాయుడుని అధిష్టానం గుర్తించకపోవడం బాధగా ఉందన్నారు.

తమ అదృష్టం ఏ విధంగా ఉందో తమకే తెలియదని ఆయన అన్నారు. పార్టీ తమను అభ్యర్థులుగా ప్రకటించకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన అన్ని సభలకు హాజరవుతున్నామన్నారు. పార్టీ అంటే అందరికీ గౌరవం ఉండాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుంటే ఎవరికి భవిష్యత్తు ఉండదు అన్నారు. ఉద్యోగులకు సగం జీతం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..